Others

ముల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండెనుండి ఆ ముల్లుని తీయకండి
దాన్నలా వదిలేయండి
అది కదిలినంత కాలం గుండెల్లో
గాయం రక్తపు గుటక వేస్తుంది
శ్రామిక బానిసత్వ చిత్రానికి
సూర్యోదయం ఓ కొత్త రంగు బహుకరిస్తుంది
జీవితం తొడుక్కున్న వెట్టి సంకెళ్లు
కదిలినప్పుడల్లా నిత్యం
కన్నీటి పాటకి కొత్త లయ సమకూరుతుంది
ఆ ముల్లే కదా! నా వునికి పునాది
నా సాంత్వనారహిత స్వతంత్ర రణానికి నాంది
యుగాల నుండి నా తలలపైన
దుక్కుతున్న పాదాల ప్రళయనాదాల
బీభత్స స్వరగీతాల ఆది పల్లవి
వేదాల చతుస్తంత్ర వీణపై
అలల పడగలతో కదం తొక్కుతూ
నన్ను నిలువునా బహిష్కరించిన పాట
ఏనాటికైనా గుండెలోని ఆ ముల్లే
చరిత్రకి చెరగని ఆనవాలై నిలుస్తుంది
నా జనన మరణాల నమోదిత పీఠికలో
ఆ ముల్లొక నెమలికన్ను
నేల గరిమనాభిలో నుండి
కోటి కోటి పిడికిళ్ల నినాదాలై
నా అస్తిత్వానికి చిత్రిక పట్టే
సప్త వర్ణాల బహిష్కృతి కుంచె అది!
దాన్నలా వదిలేయండి!!

- ఈతకోట సుబ్బారావు, 8008562742