Others

కవిత్వం సాక్షిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావాలన్ని కదం తొక్కుతూ
కాగితంపై కవాతు చేస్తుంటే

ఇంకిపోని నా కలం సాక్షిగా
కొత్త చరిత్రని లిఖిస్తాను

చేదు నిజంలాంటి గతాన్ని చెరిపి
భవిష్యత్తుపై తీపి ఆశ రుచి చూపిస్తా

ఏళ్ల బానిసత్వాన్ని వదిలేసినా
మనసుని వీడని అలసత్వాన్ని వదిలిస్తా

నా కవిత్వం వెన్నల్లో ఆడుకునే
అక్షరాలే కాదు
అవసరం అయితే కత్తిపట్టే
యుద్దవీరులుని నిరూపిస్తా

అన్యాయం తలెత్తినచోట
న్యాయ తిరుగు బావుటాని ఎగరేసి
ధర్మాన్ని భుజానేసుకుంటా

సర్వకాల సర్వావస్తలలో
కవితావికాసపు శిఖరపు
అంచులపై అక్షర జెండా ఎగరేస్తా

మనసావాచా కవిత్వపు చేయి
పట్టుకోని నవ నిర్మాణ నిర్మాతనై

కొత్త వొరవడికి నాందినవుతా

కవిత్వ దినోత్సవ సాక్షిగా
కవిత్వంతో మమేకమైపోతాను!!
*
(నేడు వరల్డ్ పొయట్రీ డే)
*

- పుష్యమీ సాగర్ 90103 50317