Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమియు సూర్యుడు, చంద్రుడు చుక్కలు ఆకసము
విశ్వమన్న నివియేకద? - వీని కథయె రామకథ

అనగానే వారలంత నోరు తెరచినారు
శ్రీకృష్ణుని పదములపై శిరసులుంచినారు

రాధా సందర్శనం
వచనం- అలా ఎంతసేపున్నారో తెలీదు. ఆ పారవశ్యంలోంచి తేరుకొని, కళ్ళు తెరిచేసరికి, మళ్ళీ కృష్ణుడు మటుమాయం! ఎటువెళ్ళాడో తెలియదు. కృష్ణుడు లేడు కానీ కృష్ణుడి స్థానంలో అతని పాదుకలు మాత్రం ఉన్నాయి.
వాటిని కళ్ళకద్దుకొని లేచారు. ‘‘కృష్ణా! కృష్ణా!’’యని నలుదెసల వెదకసాగారు.
ఆ వెతుకులాటలో మల్లెపొదల్లోంచి కృష్ణపత్నులూ మొగలి పొదల్లోంచి గోపికలూ బయటపడ్డారు. నదీ ప్రవాహాల్లా కలిసిపోయారు.
వీరిని చూచి వారలు, వారిని చూచి వీరలు తలలు పంచుకున్నారు. చెదరిన కురుల్నీ, తడిసిన ముఖాల్నీ సరిచేసుకున్నారు. ఒకరినొకరు నవ్వుల్తో పలకరించుకున్నారు. ఒక గుంపుగా సాగిపోసాగారు.
మధ్యలో వారి దారికడ్డంగా ఒక నది వెల్లువెత్తి పారుతోంది. దానిని దాటడానికి వారంతా భయపడ్డారు. ఆ అర్ధరాత్రివేళ పడవాలేదు. సరంగూ లేదు. పీకలలోతు నీటితో ప్రవహిస్తోందది- అప్పుడు వారు తమ దైవం శ్రీకృష్ణపరమాత్ముని తమ తమ మనసుల్లో స్మరించుకుంటూ, నీటిలో కాలూ నారు.
అత్యంత విచిత్రంగా అది మడమలోతు నదిగా మారిపోయింది. వాళ్ళు కళ్ళు మూసుకొని, సాహసంగా ఆ నదిని దాట యత్నించారు. ‘‘కృష్ణా! కృష్ణా’’! అంటూ కొందరు ‘‘రాధా మాధవా!’’ అంటూ మరికొందరు నామజపం చేస్తూ ఆ నదిని దాటసాగారు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087