Others

అనుభూతే పరమ లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీచక్రము, మానవ శరీరం
ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
*
శ్లో వాయుః ప్రాణి ఇతిజ్ఞేయః వాయుః ప్రాణ ఇత్యుచ్చతే
వాయుః ప్రాణోభూత్వానాశికాం ప్రవిశతి,
వాయుః ప్రత్యక్షం బ్రహ్మ’’ ఆత్మోపనిషత్
భావార్థం: వాయువు ప్రాణవాయువుగా ఇడ, పింగళ నాడుల ద్వారా మన నాసికా రంధ్రములనుండి లోనికి ప్రవేశించిన మన శరీరాన్ని జీవింపజేయుటకు కారణమగుచున్నది. కావున వాయువే బ్రహ్మమైయున్నది. ఆత్మోపరిషత్ ఇంకా ఇలా చెప్తోంది.
శ్లో ఓం నమో బ్రహ్మణే నమస్తే వాయో
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి - త్వమేవ ప్రత్యక్షం
బ్రహ్మవదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం
వదిష్యామి - తన్మావవతు, తద్వక్తార మవతు
అవతుమాం- అపతువక్తారం
శ్రీ లలితా సహస్ర నామాలలో కూడా ధ్యాన సంబంధ విషయముల గురించి ప్రస్తావనలున్నాయి, అమ్మవారిని గురించి 254వ నామంలో ‘ ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూపాయై నమః’ అని చెప్పబడింది. అంటే ధ్యాన ధ్యాతృ ( ధ్యానము చేయువాడు) ధ్యేయ ( ధ్యానలక్ష్యము) యొక్క సమిష్టి రూపమే, అమ్మవారని చెప్పబడింది. పతంజలి మహర్షి చెప్పినట్లుగా, ‘త్రయమేకత్వ సంయమమ్’, దృశ్యము, దృష్టి, ద్రష్ట జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనువాటిని ‘త్రిపుటి’ అంటారు. వీటిమధ్య తేడా లేకుండా, మూడు ఒకటైన స్థితిని ‘సమాధి’ అని పతంజలి మహర్షి చెప్పారు. సాధారణంగా ధారణకు ధ్యానానికి తేడా ఉందని మనకు తెలుసు! ధారణలో, ధారణ చేసేవాడు, ధారణ చేయబడేది అని రెండు విడిగా ఉంటాయి కాని ధ్యానంలో ఆ విధంగా ఉండటానికి వీలు లేదు, కారణం ధ్యానం చేసేవాడు, ధ్యేయం ( ధ్యానం చేయబడేది) రుూ రెండు కూడా ధ్యానంలో కలిసిపోవాలి. లేకుంటే పరమ లక్ష్యం నెరవేరదు. ధ్యానంలో ధ్యేయము లీనమైపోయి, చివరికి అనుభూతి మిగులుతుంది. అట్టి అనుభూతే అమ్మవారని చెప్పుకోవాలి. శ్రీకృష్ణపరమాత్మ ధ్యాన పద్ధతులను బోధించుచు మనస్సును బాహ్య ప్రపంచంనుండి మరల్చి, అంతర్ముఖముగావించి, హృదయములోని చైతన్యాత్మనే (అంతరాత్మ భావన) ధ్యానము చేయవలెనని తెలిపెను. అంతరాత్మ అనగా, శరీరము ఇంద్రియముల చేత అన్ని వ్యాపారములు (క్రియలు) చేయించునది. ఇది మూడు విధములని చెప్పవచ్చును. 1.శుద్ధాంతరాత్మయనగా శరీరేంద్రియముల నిగ్రహించి, సాత్వికమైన సత్క్రియలను నిర్వహించునది. 2.పరమాత్మ యనగా పై రెండింటిని అధిగమించి కేవలము సాక్షిగానుండునది. 3.అన్నిటినిమించి, సచ్చిదానంద లక్షణాత్మకమైనది, పరబ్రహ్మస్వరూపము, అదియే అసలైన ‘నీవు’.
ధ్యానయోగాన్ని నిర్వచిస్తూ పతంజలి మహర్షి ‘తత్రప్రత్యయైకతానతా ధ్యానమ్’ అని చెప్పారు. అనగా ధారణయోగంవల్ల కలిగినదాన్ని ఏకధారగా పొందడమే ధ్యానం. అట్టి అఖండమైన జ్ఞానధార ప్రవాహానందాన్ని శ్రీ శంకర భగవత్పాదులు ఇలా వర్ణించారు.
శ్లో శంభుద్యాన వసంతసంగిని,
హృదారామే షు జీర్ణ్ఛదాః
స్రస్త్భాక్తిలతాచ్ఛటా విలసితాః
పుణ్యప్రవాళ శ్రీతాః
దీప్యంతే గుణకోరకాః జపవచః
పుష్పాశ్చ, సద్వాసనాః
జ్ఞానానంద సుధామరందలహరీ,
సంవిత్ఫలాభ్యున్నతిః
భావార్థం: ఓం శంభో మహాదేవ, నా హృదయమందు నిన్ను గమ్యంగా భావించిన ధ్యానయోగం ఒక వసంతం వలె శోభించాలి.
ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014