Others

ఎక్కువసేపు ఏసీ.. శారీరక రుగ్మతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి కాలంలో చాలామంది ఏసీ గదుల్లో ఉంటూ ఉపశమనాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొందరు కూలర్లమీద ఆధారపడతారు. ఇంటి వాతావరణాన్ని చల్లబరిచే ఈ ఎయిర్ కండీషన్ సెట్లు, కూలర్లు వాడడం మన ఆరోగ్యానికి మంచిదా...? ఎక్కువసేపు ఏసీలో ఉండడంవల్ల పలు శారీరక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు పలువురు వైద్యనిపుణులు.
* ఎక్కువసేపు ఎయిర్ కండీషన్డ్ వాతావరణానికి అలవాటుపడడం వల్ల... శరీరం కేవలం ఒకస్థాయి వాతావరణానికే సహకరించే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు తీవ్రమైన ఒత్తిడికి కూడా గురై గుండెపై, శ్వాసకోశంపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది.
* అలాగే ఎక్కువసేపు శీతల ప్రదేశంలో కూర్చొని పనిచేస్తే గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
* ఏసీలో ఎక్కువసేపు కూర్చుంటే చర్మం పొడిబారి పోతుంది.
* తలుపులు మూసివేసి, సెంట్రలైజ్డ్ ఏసీలో పనిచేయడంవల్ల ఎలర్జీల బారిన పడే అవకాశం కూడా ఉంది. విపరీతమైన తలనొప్పి, కళ్ల దురద రావడం, న్యూమోనియా బారిన పడడం లాంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
* బీపీ ఉన్నవారు సాధ్యమైనంత వరకు ఏసీ వాతావరణంలో పనిచేయకపోవడమే మంచిది. ముఖ్యంగా గాలి బయటకు వెళ్లదు కాబట్టి... అనుకోని సందర్భాల్లో రక్తపోటు కూడా పెరుగుతుంది.
* అందుకే ఎవరైనా ఏసీ వాడినా... సాధారణ గది ఉష్ణోగ్రతను కచ్చితంగా పాటించాల్సిందే. మొత్తం రోజంతా ఏసీలో గడపకుండా.. అవసరమైనప్పుడు మాత్రమే ఏసీలో వేసవి తాపాన్ని తీర్చుకోవాలి. అలాగే కూలర్లను కూడా అవసరం మేరకే వాడాలి.