Others

కలియుగ కల్పవృక్షం.. గురు రాఘవేంద్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయ రాఘవేంద్రులను తెలియని వారుండరు. మానవ కళ్యాణంకోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాఘవేంద్రులు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. ‘‘నేను, దేవుడు ఒకటికాము మేమిరువురము వేరువేరు. అతడు ఈశుడు, నేనాతని దాసుడను మాత్రమే’’ అని చెప్పే ద్వైత సిద్ధాంతంను ప్రవచించిన మద్వాచార్యుల బోధనల వ్యాప్తికోసం ప్రచారంచేసిన వారే శ్రీ రాఘవేంద్రస్వామి. మధ్వ సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి. మద్వ ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణంకోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీ రాఘవేంద్రులు. .
అలాంటి మహనీయుడైన శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1595 సంవత్సరం, మన్మనాథ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సస్తమీ మృగశిరా నక్షత్రంలో తిమ్మన్నభట్టు, గోపాంబ దంపతులకు కలిగిన సంతానమే రాఘవేంద్రులు. ఇతని పూర్వ నామం వేంకటానాథుడు. అతడు చిన్నప్పటినుంచి ఏకసంధాగ్రాహి. పరిస్థితుల ప్రాబల్యమో, గురువుగారి మార్గోపదేశమో కానివేంకటనాథుడు గృహస్థాశ్రమంలో కొన్నాళ్లు ఉండి ఆ తర్వాత సన్యాసం తీసుకున్నారు. అపుడే ఆ వేంకటనాథుడే రాఘవేంద్రునిగా మారారు. సన్యాసం తీసుకోక ముందు కేవలం ఒక కుటుంబమే ఉండేది ఆయనకు. కాని గురు పరంపరలోకి వెళ్లిన తరువాత ప్రపంచమే ఆయన కుటుంబమైంది. తన్ను పిలిచిన వారికి తన్ను స్మరించిన వారికి తరుణోపాయం చూపించడంలో రాఘవేంద్రులు క్షణమైనా ఆలస్యం చేయరు. ఈ కలియుగంలో నానాభాధలు పడుతున్న వారు ఈశుని కరుణా కటాక్షాలు కావాలను కొన్నవారు గురు రాఘ వేంద్రులను ఆర్తిగా తలుచుకుంటే చాలు వారి ఇహ లోక కష్టాలు తీరుతాయ. పరంధామానికి మార్గం కూడా కనబడుతుంది. చిన్నతనం నుంచి అన్ని విద్యలలో ఏకసంథాగ్రాహి. వెంకటనాధుడు చదువు కొనసాగిస్తున్న ఆయన మనస్సు మాత్రం మఠంలో మూల రాముల పూజలు చేయటానికే మనస్సు తహతహలాడుతూ వుండేది. శ్రీ సుదీంద్ర తీర్థుల వద్ద శిష్యునిగా చేరి టీకా, తాత్పర్యాలు వ్రాసి పరిమళచార్యునిగా గురువుచేత బిరుదు పొందాడు. అమరకోశం కంఠస్తంగా వుండేది. సంస్కృతం, నిఘంటువులు వెంకటనాథుని నోటో లనే వుండేవి. చదువులు ముగిసిన అనంతరం యవ్వనంలో వున్న వెంకటనాథునికి సరస్వతీ అనే అపూర్వ అందమైన అందాల రాశితో వివాహం జరిగింది. వీరి వివాహం ఎంతో వైభవంగా సాగింది. ఒక పుత్రుడు జన్మించాడు. భార్య అనుమతి తీసుకొని గురువుతోపాటు దేశ సంచారం సాగిస్తూ వేదాంత చర్చలు జరిపి ఎందరినో మెప్పించారు. గురుసుదీంద్ర తీర్థులు వెంకటనాధునికి మహాభాష్యాచార్యుడని బిరుదు ఇచ్చారు. .
తన తరువాత మఠానికి వారసుడు వెంకటనాథుడని గురువు సుదీంద్రులు భావించారు. అంతేకాకుండా ఒక రోజు శ్రీ మూలారాములు సుదీంద్రులకు కలలో కనిపించి తన అనంతరం పీఠం ఎక్కే అర్హత వెంకటనాథునికి మాత్రమే వుందని చెప్పారు. ఈ విషయాన్ని వెంకటనాథునికి గురువు సుదీంద్రులు వివరించారు. సన్యాసం స్వీకరించే విషయం మీమాసంలో వున్న వెంకట నాథునికి సరస్వతీదేవి కలలో కనిపించి మఠం పీఠాధిపతిగా సన్యాసం స్వీకరించి మధ్వ సిద్ధాంతాన్ని లోకాన్ని విస్త్తరింపచేయాలని సెలవిచ్చింది. తంజావూరు పాలకుడు రఘునాథ భూపాలుని ఆధ్వర్యంలో క్రీ.శ.1621, ఫాల్గుణశుద్ధ ద్వితీయలో ప్రజల సమక్షంలో పీఠాధిపతిగా పట్ట్భాషేకంగావించి సన్యాసం స్వీకరించారు. గురువు సుదీంద్రతీర్థులు వెంకటనాథునికి రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేసారు. నాటినుంచి మఠ బాధ్యతలు గురు రాఘవేంద్రులు తీసుకొన్నారు.

- కె. వాణిప్రభాకరి