Others

బికినీ సుందరి సాహసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఫ్టీలో వున్న స్వీడిష్ పోలీసాఫీసర్ మైకియాలా కెల్నెర్ పోయిన మంగళవారం స్టాక్‌హోం పార్క్‌లో స్నేహితులతో కలిసి బికినీ ధరించి, సన్ బాతింగ్ (ఎండలో శయనం) చేస్తూండగా, వాళ్ల దగ్గరికో మ్యాగజీన్‌లు అమ్మేవాడొచ్చాడు. మాటల మధ్యలో ఆ సేల్స్‌మ్యాన్ రుూ బికినీ బృందంలోని ఒకామెకు చెందిన స్మార్ట్ఫోన్ కొట్టేశాడు. గప్‌చిప్‌న జారుకుంటున్నాడు.
బికినీ సుందరి అయినా, పదకొండేళ్ళు సర్వీసున్న ‘నిజంగా యోధురాలై’న కెర్నెల్- ‘‘నా ఫోనో...’’ అంటూ మొత్తుకుంటున్న ఫ్రెండుని అలా వుంచి, ఆ మ్యాగజైన్లవాడే దొంగ అనుకొని ఒక్క ఉదుటన లేచి, పరిగెత్తి- అతనిమీద అమాంతం లంఘించింది. బికినీలో వుండి దొంగని వెంటాడటానికి సిగ్గు పడుతోంది అనుకున్న దొంగా, పార్కులోని యితరులూ కూడా నివ్వెరపోయి అంతలో తేరుకుని - ‘శభాష్!’ అన్నారు. దొంగ దొరికిపోయాడు.
‘‘బికినీలోనే కాదు- నేను నగ్నంగా స్నానం చేస్తున్నా దొంగని వెంటాడి పట్టుకుంటాను. అంతేగానీ వదలడం కల్ల!’’ అన్నదామె. ఈ ఫోటోల్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ‘‘శభాష్!’’ అన్నారంతా. అదీ సామాజిక బాధ్యత అంటే! అన్నారెందరో.