Others

చైత్ర చైతన్యము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివపూజకు
వేళాయంటూ
అడవి అంతటా పూసిన
మోదుగపూల అరుణకాంతులు
ఉషాకిరణాల సమ్మిళితమై
మిరుమిట్లు గొలుపుచుండగా
మళయమారుత
శిశిర శీతలములకు
ఆకురాలిన తరువులు
క్రొత్త చిగురులు తొడుగగా
జలతరంగమై
రైతురాజు వడికిన
ఆకుపచ్చని చీరకట్టిన
ప్రకృతి కాంత
పంచవనె్నల రామచిలుక
కనువిందు ఆవిష్కరణ
ఒక అపురూప దృగ్విషయం
సప్తవర్ణ సొబగులద్దుకున్న
లతాంతికలు
గాలి అలలుగా
పారిజాత సుగంధ
పరిమళాలు వెదజల్లగా
చిటారుకొమ్మలుగా
పక్షుల కిలకిలారావములై
మావి చిగురుతిన్న మత్తకోకిల
తీయని గానమాలపించగా
తెలుగునేలగా
అలరారిన కోవెలలుగా
సుప్రభాతసేవ గంటానాదములై
వీనులవిందవగా
కాలచక్రం విలంబికి
వినమ్ర వీడ్కోలు పల్కుతూ
ఉగాది ఉషస్సులుగా
వేపపూల సుగంధ
పరిమళాలు వెదజల్లుతూ
చైత్ర చైతన్యము
శ్రీ వికారిని
స్వాగతించే శుభసంకల్పమై..
కలిమి లేమిలై
ఆరురుచుల సంగమాల
ఉగాది పచ్చడిగా ఆస్వాదించిన
తెలుగు లోగిళ్లు నడయాడె
పంచాంగ శ్రవణం
జీవనగమనమై!

- మడిపల్లి హరిహరనాథ్ 96035 77655