Others

అప్పులన్నీ తీర్చిన అప్పుల అప్పారావు (ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వింత ఇల్లు- సంతగోల’ చిత్రం తర్వాత రమాప్రభ చిత్ర నిర్మాణానికి ఆమడ దూరంలో వుంది. మళ్లీ అప్పుల అప్పారావు చిత్రం ఎలా నిర్మించింది? అనుకుంటున్నారు కదూ? నిజమే? శరత్- రమప్రభ విడిపోయిన తరువాత రమాప్రభ ఒంటరిగా వెస్ట్‌మాంబలంలో వుంటోంది. అప్పటికి ఆస్తులు పోయినై.. అంతస్తులు పోయినై.. సినిమాలు బాగా తగ్గాయి. ఇటువంటి సమయంలో ఏదో వ్యాపకం కావాలి. లేకపోతే పిచ్చెక్కిపోతుంది. అందుకని రమాప్రభ సోదరుడు రెడ్డిశేఖరు సినిమా నిర్మాణం ప్రారంభించాడు. తనకు గతంలో రమాప్రభ డేట్స్ చూస్తుండటం మన ఇండస్ట్రీలో అందరితోనూ మంచి పరిచయాలున్నై.
ఎలాగైతేనేం! చెన్నై విజయా గార్డెన్స్‌లో ‘అప్పుల అప్పారావు’చిత్రం షూటింగు ప్రారంభమయ్యింది. ఇవివి సత్యనారాయణ తొలి చిత్రం చెవిలో పువ్వు. అది ఫ్లాపయ్యింది. రెండవ చిత్రం ఇది. రాజేంద్రప్రసాద్, శోభన హీరో హీరోయిన్లు గనుక డేట్సు ఎడెస్ట్‌మెంట్ విషయంలో ప్రోబ్లమ్ లేదు. కథ, మాటలు, దర్శకత్వం ఇవివి సత్యనారాయణ. పేరుకి ఎల్‌బీ శ్రీరామ్ డైలాగు రైటరయినా... షాట్‌లో అప్పటికప్పుడు ఇంప్రోవైజ్ చేస్తుండేవాడు. ప్రతి సన్నివేశం కూడా రక్తికట్టించేవాడు. సింగిల్ ప్రేము కూడా రాజీపడకుండా తీశాడు.
సినిమా నిర్మాణం తక్కువలో తక్కువ ఖర్చుపెట్టినా తడిసి మోపెడయ్యింది. రెడ్డిశేఖరుతో బాటు సురేష్, సురేష్ బ్రదరు (వీళ్లంతా రమాప్రభ సిస్టర్ పిల్లలే) తలో చెయ్యి వేశారు. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గుట్టుచప్పుడు గాకుండా సంసారాలు చేసుకుంటున్నవాళ్లే గాని ఇంత డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచెయ్యడం వారికి తెలీదు. వాళ్లూ అప్పులపాలయ్యారు. సినిమా టైటిలు ప్రభావం అప్పుల అప్పారావేంటి? ఈ పేరు సార్థకమయ్యేలా వుంది అంటూ తలలు పట్టుక్కూర్చున్నారు. సినిమా అయిపోయింది. బ్రహ్మానందం ఐరెన్‌లెగ్ శాస్ర్తీ కామెడీ ఎవరికీ అర్థం కాలేదు. శాస్ర్తీ అడుగుపెట్టగానే అక్కడ భగ్గుమంటూ విధ్వంసం జరగడం ఇదేమీ ఫేంటసీ సినిమా కాదు కదా అన్నారు. అయినా తద్దినం మంత్రాలు చదువుకొనే బ్రాహ్మణుడికి అంత పెద్ద వేషమా? ఇవివికి పిచ్చెక్కిందా? ఇలా తలోరకంగా అనుకుంటున్నారు.
ఇక రమాప్రభ- అసలే టెన్షనుకి పుట్టినిల్లు. వూరికే కంగారుపడిపోతుంది. ఏడ్చేస్తుంది. నేను మొదట్నించీ చెబుతూనే వున్నాను. మనకు సినిమాలు అచ్చిరావు. ‘వింతఇల్లు- సంతగోల’ చిత్రం తర్వాత జీవితంలో సినిమాల జోలికి వెళ్ళకూడదనుకున్నారు. వెళ్లాను. ఖర్మ! అనుభవిస్తాను’ తలబాదుకుంది.
సినిమా అంటే అదే మరి.
ఇవివి కష్టం ఫలించింది. ఎవరెన్ని మాటలంటున్నా తొణక్కుండా.. బెణక్కుండా తన కర్తవ్యం తాను నిర్వర్తించాడు. ఆ సినిమాకి చేసిన అప్పులన్నీ తీరిపోయి, నిర్మాతలుగా మధ్యలో దిగినవారు జీవితంలో స్థిరపడిపోయారు. ఇవివికి మంచి ఫౌండేషను. ఈ నిర్మాతలు మళ్లీ సినిమా తీస్తామన్నా సున్నితంగా తిరస్కరించాడు. డబ్బులేకుండా సినిమా ఎలా మొదలుపెట్టవచ్చో.. ఒళ్ళు దగ్గరుంచుకొని సినిమా ఎలా పూర్తచేయొచ్చో ‘అప్పుల అప్పారావు’ చిత్రం నేర్పించింది అంటాడు. ఇవివి జీవితంలో అఖండ విజయం సాధించిన తొలి చిత్రం అప్పుల అప్పారావు. నిజం ఏవిటంటే! నిర్మాతల అప్పులన్నీ తీరిపోయాయి. ఈ సినిమా పూర్తిచెయ్యడానికి ఇ.వి.వి. చేసిన అప్పులు అలాగే మిగిలిపోయాయి. ‘ప్రేమఖైదీ’రామానాయుడు చిత్రం తర్వాత మళ్ళీ మామూలు మనిషయ్యాడు ఇవివి.
అదే సినీమా (య)!

-ఇమంది రామారావు 9010133844