Others

ఏవీ చైతన్య ఊపిరులు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటగా సమాజాన్ని చైతన్యపరచడానికి ప్రారంభమైన సినిమాలు దాన్ని పరిణితిని అంతకంతకు పెంచుకుంటూ, నేడు ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది.

1887లో ఇంగ్లాండ్‌కు చెందిన విల్లియం ప్రైస్ గ్రీస్ కెమెరాను కనుగొనగా, 1895లో ఉడ్‌వల్ లాతమ్ సినిమా ప్రొజెక్టర్ కనుగొన్న తర్వాత ప్రపంచ సినిమా రంగంలో పలు విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

భారతదేశంలో మొదటగా జులై 7, 1896లో ముంబాయిలోని వాట్సాన్ హోటల్‌లో ల్యుమియార్ బ్రదర్స్ సినిమాను ప్రదర్శింపజేశారు. తెలుగు సినిమా చరిత్రలో 1931లో భీష్మ ప్రతిజ్ఞ అనే మొదటి మూకీ సినిమాను హెచ్‌ఎమ్‌రెడ్డి నిర్మించి, మళ్ళీ అతనే అదే సంవత్సరంలో సత్యహరిశ్చంద్ర అండ్ టాకీ చిత్రాన్నీ నిర్మించారు.
హిందీ చలనచిత్ర విభాగంలో 1931లో ఆలం ఆరా అనే మొదటి టాకీ చిత్రాన్నీ ఆర్దేషర్ ఇరానీ నిర్మించారు. మొదటగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసులో ఏర్పాటుచేశారు. ఉమ్మడి రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు నటించే అవకాశాలు దక్కేవి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘుపతి వెంకయ్య మొదటగా స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, పలు చిత్రాలలో నటించి, చిత్రాలను తీయడానికి గాయిటీ అనే పేరుతో సినిమా స్టూడియోను నిర్మించి, పలు చిత్రాలను సైతం నిర్మించి, సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా, పలు విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన చూపినందుకు అతన్ని జ్ఞాపకార్థంకై రఘుపతి వెంకయ్య నంది పురస్కారాలను అందజేయడం జరుగుతున్నది. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ పితామహుడిగా పేర్కొంటారు.
సమాజంపై సినిమాల ప్రభావం:
సమాజంపై సినిమాలు చాలా ప్రభావం చూపాయి. మొదటగా సాంఘిక చిత్రాలు, సమాజాన్ని పలు అంశాలలో చైతన్యపరుచుటకు దోహదపడేవి, పేదల కష్టాలు, ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు, కుటుంబ చిత్రాలతోపాటు, దౌర్జన్యాలు, అహంకారాలు, వివక్షతలు, అస్పృశ్యతలను తెలిపే చిత్రాలను తీయడం జరిగింది. స్వాతంత్య్రోద్యమం ముందు ఆంగ్లేయుల పాలన, వారి పాలనలో భారతీయులు అనుభవించిన ఇబ్బందులు, స్వాతంత్య్ర సమరానికి, సమరయోధులు చేసిన త్యాగాలను, దేశభక్తిని ఇనుమడింపజేసే పలు చిత్రాలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. సమాజంలో అమలవుతున్నటువంటి సాంఘిక దురాచారాలు వరకట్నం, సతీ, కుల వివక్షలే, అంటరానితనం వంటి పలు చిత్రాలను తీసి సమాజ చైతన్యానికి దోహదబడింది.
1938లో మాలపిల్ల అనే సినిమా విడుదలై సమాజంలో కుల వివక్షత నిర్మూలన గావించే చైతన్యాన్నిచ్చింది.
1939లో రైతుబిడ్డ అనే మరో చిత్రం విడుదలై ఆధిపత్యం కులాలు, నిమ్న కులాల మధ్య బేధాలను తొలగించేందుకు ఈ చిత్రం ఉపకరించింది.
1982లో రిచర్డ్ అట్టెన్ బరో తీసిన గాంధీ సినిమాను తెలుగులో అనువదించడం అలాగే హిందీ మరియు పలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం జరిగింది. ఈ సినిమాలో పలువురికి దేశభక్తిని కలిగించేలా, గాంధీ చరిత్రను, స్వాతంత్య్ర పోరాటాన్నీ కళ్ళకుకట్టేలా తీసి, పలువురికి సమాచారాన్నిచ్చేలా దోహదబడినది. సినిమాతీసిన ఇరవై సంవత్సరాల తర్వాత జులై 2010న కొమరంభీం అనే చలనచిత్రం విడుదలయ్యి నిజాం కాలంలో రాజకార్లపై పోరాడిన గిరిజన నాయకుడు చరిత్రను తీసి పలువురికి పోరాట స్ఫూర్తిని కల్పించారు. మొదటగా పౌరాణిక, సాంఘిక, కుటుంబ చిత్రాలనుతీస్తూ, నేడు ఎలాంటి కథాంశం లేకున్నా సాంకేతిక పరిజ్ఞానాన్నీ ఉపయోగించి కోట్లకుకోట్లు ఖర్చుపెడుతూ, ప్రచార ఆర్భాట హంగులతో ఆర్థికపరమైన వ్యాపారాలు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు.
సమాజంలోని యువతసైతం సినిమాలు తిలకిస్తూ, అందులో నటించిన తమ అభిమాన హీరోలకు అభిమాన సంఘాలను ఏర్పాటుచేసుకొని అలంకరణలో, వ్యక్తిత్వంలో అనుసరిస్తూ వస్తున్నారు. కావున సినిమాలు సైతం సమాజానికి ఉపయోగకరమైన, జ్ఞానాన్ని పెంచేవిధంగా, తెలియని సమాచారాన్ని అందించేటటువంటి, భిన్నరంగాలలో చైతన్యం అందించేటటువంటి బంధాలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చేటటువంటి చిత్రాలను తీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో సైతం తెలుగు చలనచిత్ర పరిశ్రమ రెండుమూడు కుటుంబాల అధీనంలో వుంటూ రాజకీయ పార్టీలవలే, ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మద్రాసు చిత్ర పరిశ్రమనుంచి వేరై హైదరాబాద్‌లో ఏర్పాటుచేసుకొని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, రామోజీ ఫిల్మ్‌సిటీలను ఏర్పర్చి, వారు పలు చిత్రాలను సైతం నిర్మిస్తూ చిత్ర పరిశ్రమను అభివృద్ధిపరుస్తూ, ఆర్థిక వనరులను సైతం సమకూర్చుకుంటున్నారు. చిత్రాలలో నటించాలంటే నటన వస్తే సరిపోదు, అగ్ర హీరోల అండదండలుండాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ప్రజాస్వామ్య దేశంలో కుటుంబ పాలనలు ఎలా కొనసాగుతున్నాయో చిత్ర పరిశ్రమలో సైతం అలాగే జరుగుతుందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఏదిఏమైనప్పటికీ సమాజానికి ఉపయోగపడే చిత్రాలు రావాలి తప్ప చేటుచేసేటటువంటి చిత్రాలవలన ఉపయోగంలేకపోగా సమాజాన్ని చెడు మార్గంవైపు మళ్ళించే ప్రమాదముంటుంది. సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు, రచయితలు సైతం వ్యాపారంకోసమే గాకుండా పలు సందేశాత్మకమైన సినిమాలు చేయడానికి ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

చిత్రం.. రైతుబిడ్డ చిత్రంలో కొమ్మూరి పద్మావతి, బళ్లారి రాఘవ, టంగుటూరి సూర్యకుమారి

- డా.పోలం సైదులు