Others

వైరుధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు కాసిని పూలమొక్కలున్నాయి
వాటి పరిమళాలున్నాయి
కొన్ని నవ్వులున్నాయి
బోలెడన్ని పువ్వులున్నాయి
ఆకాశముంది, ఇంద్రధనుస్సూ ఉంది
మేఘాలతో పరుగుపందెమేస్తూ
కువకువలాడే రెండు పక్షులున్నాయి
పుస్తకాలున్నాయి
వాటినిండా తొణికిపోయేటన్ని
అక్షరాలున్నాయి
నది ఉంది, దానిని దాటే పడవా వుంది

నీకు మాత్రం
చుట్టూ పరుచుకున్న
ఒంటరిదీ ఒకటివుంది
తవ్వుకునే కొద్దీ బయటపడేటన్ని
గాయాలున్నాయి
తాగడానికి లెక్కలేనన్ని
కన్నీటి చెలమలున్నాయి
కనుల నిండా
చిక్కని కాటుకలాంటి చీకటుంది
కానీ నువ్వు నక్షత్రాలను ఏరుకుంటూ
నవ్వై వికసిస్తావు
నేను వెనె్నల కొలనులో ఈదులాడుతూ కూడా
రాత్రులను లెక్కెడుతూ
నిన్నటి పువ్వులా
ముఖం ముడుచుకుంటూనే ఉంటాను

- పద్మావతి రాంభక్త, 9966307777