Others

బోధి వృక్షం కింద ధ్యానం చేస్తే ‘జ్ఞానం’ వస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధి వృక్షం (రావిచెట్టు) కింద కూర్చొని ‘ధ్యానం’ చేస్తే ‘జ్ఞానోదయం’ అవుతుందని బౌద్ధం ఆచరించేవారంటారు. అందుకే బిహార్‌లోని ‘బోధ్ గయ’లోని బోధి వృక్షం నీడలో- వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చినవారు ‘ధ్యానం’ చేస్తూ కనిపిస్తారు. దాదాపు రెండున్నర వేల సంవత్సరాలుగా ఇప్పటికీ ఈ దృశ్యం కనిపిస్తోంది. ఈ రెండున్నర వేల సంవత్సరాల్లో ఎందరికి జ్ఞానోదయమైందో, ఎంతమంది వికసించిన వివేకంతో విజ్ఞులయ్యారో తెలియదు. వర్తమానంలో ‘జ్ఞానం’ అంటే ఏమిటన్న ప్రశ్న తప్పక వేసుకోవాలి? ఏ రకమైన ‘జ్ఞానోదయం’ కోసం బోధ్ గయకు పరుగులు పెడుతున్నారు?.. అని నిశితంగా పరిశీలించాల్సిన అవసరముంది. ప్రస్తుతం జ్ఞానమంటే... అక్షర జ్ఞానం, భాషా జ్ఞానం, మాతృభాషతోపాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానం, వ్యవహార జ్ఞానం గూర్చి చెప్పుకుంటాం. పాఠశాల స్థాయి విద్యాజ్ఞానం పొందాక మరింత ఉన్నత స్థాయి జ్ఞానం కోసం కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి జ్ఞానం కోసం పరితపిస్తాం. వైద్య విద్యలో, ఇంజినీరింగ్ విద్యలో, కంప్యూటర్ రంగంలో ‘జ్ఞానం’ కోసం అహర్నిశలు తాపత్రయ పడుతూ ఉండటం చూస్తూ ఉన్నాం.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) విస్తృతి పెరిగాక వివిధ ఉప విభాగాల పరిధి విప్పారుతోంది. ఆ జ్ఞానాన్ని అందుకోవాలని దేశంలోని మంచి విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం, అర్హత పరీక్షలు రాసేందుకు విద్యార్థులు రాత్రి పగలు ఏకం చేస్తున్న సంగతి తెలిసిందే! విదేశాల్లోని ప్రీమియర్ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకూ పోటీపడుతున్నారు. ఈ ఉరుకులు, పరుగులు కేవలం ‘‘జ్ఞానం’’ కోసమే. ఆధునిక జ్ఞానం అందుకోవడం కోసమే..
గత సంవత్సర జ్ఞానం ఈ సంవత్సరం పాతబడిపోతోంది. ఆ జ్ఞానం రూపాంతరం చెందడమేగాక కొత్త ఆవిష్కరణలు వెలుగు చూసి వాటి చుట్టూ కొత్త జ్ఞానం జిగేల్‌మంటూ కనిపిస్తోంది. దాంతో నిరంతరం ‘జ్ఞాన దాహం’తో విద్యార్థులు పరితపిస్తున్నారు. ఎం.్ఫల్‌లు, పిహెచ్‌డీలు కనీస విద్యా అర్హతలుగా, ఆ స్థాయి ‘జ్ఞానం’ అత్యవసరంగా భావిస్తున్నారు.
సమాజంలోని అన్ని రంగాలలో కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, విద్య, వైద్యం, రవాణా, వినోదం, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, రక్షణ రంగంలోనూ ఇప్పటివరకున్న ‘జ్ఞానం’ రూపాంతరం చెందుతోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు మనిషి ఉపయోగించే అన్నింటిలోనూ సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. వీటి వెనక ‘జ్ఞానం’ ఇట్లా మనిషి ఉపయోగంలోకి వచ్చే సమస్తం సరికొత్త జ్ఞానంతో రూపాంతరం జరిగితే, అవి అక్కడే ఆగక మరింత ఆధునిక రూపం సంతరింపజేయడానికి మనిషి తన ‘బుద్ధి’ బలంతో, జ్ఞానంతో పరిశ్రమిస్తుంటే మొత్తం సమాజం పరవశించిపోతున్న ‘దృ శ్యం’ కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో బోధ్ గయలోని బోధి వృక్షం కింద ఏ రకమైన జ్ఞానం కోసం పిల్లలు, పెద్దలు, ఆడవారు, భారతీయులు, విదేశీయులు ‘్ధ్యనం’ చేస్తూ రోజులను దొర్లిస్తున్నారు? కాషాయ వస్త్రాలు ధరించి, భిక్షాపాత్ర పట్టుకుని అక్కడి వీధుల్లో తిరుగుతూ బుద్ధ మందిరం, పగోడాలు, ప్రతిమల ముందు ‘్ధ్యనం’ చేస్తే వారికి ఏ రకమైన ‘జ్ఞానం’ కలిగిందో ఎవరికీ తెలియదు. వీరిలో కొందరు నకిలీ సన్యాసులూ ఉన్నారట! ఈ భౌతిక ప్రపంచంలో చెప్పుకుంటున్న ‘జ్ఞానం’ అక్కడ లభించదు. ఈ ప్రపంచంలో ఎవరైనా తమదైన ‘ముద్ర’ను వదిలి వెళ్ళాలంటే ఈ భౌతిక ప్రపంచం అందిస్తున్న జ్ఞానాన్ని ఔపోసన పట్టాలి. అందులో పరిశ్రమిస్తే సంఘానికి, దేశానికి, ప్రపంచానికి తన వంతు కర్తవ్యం నిర్వహించినట్టవుతుంది. అలాగాక పిల్లలకు, యువకులకు గుండు గీయించి, కాషాయ వస్త్రాలు ధరింపజేసి బౌద్ధ ఆరామాల్లో, గృహాల్లో, మందిరాల్లో ధ్యానం... ధ్యానం... అని వెంటపడితే వారు ఏ రకమైన జ్ఞానం అందుకుంటున్నారు? ఇది కోటి రూకల ప్రశ్న. రెండున్నర వేల సంవత్సరాల ఈ ప్రక్రియ ద్వారా ఏ ఆవిష్కరణలు జరిగాయి? వేటిని ఉన్నతీకరించారు? ఏ భాషా సౌందర్యానికి మెరుగులు దిద్దారు? ఏ సాహిత్యాన్ని సృష్టించి మనుషులను స్పందింపజేశారు? ఏ నాటకాన్ని, సంగీతాన్ని రూపొందించి లలిత కళలకు కొత్త రూపం ఇచ్చారు?.. ఇట్లా ఉదయించే సవాలక్ష ప్రశ్నలకు వారి దగ్గర ఒక్క సమాధానమూ కనిపించదు. మరి వారి జ్ఞానోదయానికి అర్థమేమిటి? ఈ 21వ శతాబ్దంలో దానికేమైనా మాన్యత కనిపిస్తోందా?
దేవుడు లేదంటూనే బౌద్ధులు బుద్ధుడి ప్రతిమను దేవుడిగా పూజిస్తున్నారు, ఎనభై, వంద... ఆపైన అడుగుల ఎత్తుగల విగ్రహాలను తయారుచేయించి, ఒక్కచోటనే పదుల- వందల చిన్న చిన్న విగ్రహాలు సమకూర్చి, అలంకరించి ‘‘్ధమ్మం’’ పఠిస్తే జ్ఞానం అందుతుందా?... మానవ సమాజాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ‘ప్రేరణ’ లభిస్తోందా? లేదు!
జ్ఞానోదయానికి ‘ముక్తి’ని ముడిపెట్టి ప్రవచనాలు చేస్తారు. దేవుడే లేడని ప్రతిపాదించినప్పుడు ముక్తి.. విముక్తి అన్న మాటలకు అర్థం ఎక్కడిది? ఒక మార్మిక ప్రపంచంలోకి మనుషుల్ని తోలి, విజ్ఞానానికి, ఉత్పత్తికి, అభ్యుదయానికి తలుపులు మూసి ధ్యానం.. అష్టాంగ మార్గ ధ్యానం చేయమని, అప్పుడే అద్భుత జ్ఞానోదయం కలుగుందని ఊదరగొట్టడంలో ఏ మాత్రం హేతుబద్ధత, తార్కికత కనిపించడం లేదు. ‘శీలం’, విలువలు, వ్యక్తిత్వం, అహింస, కరుణ, ప్రేమ-దయ, నిరాడంబరత, క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరడానికి బౌద్ధం ఆచరించమని చెబుతారు. బౌద్ధంలో చెప్పిన ప్రతి అంశం అంతకుముందు ఎందరో ప్రవచించినవే. అందులో ఏదీ కొత్తది లేదు. ముఖ్యంగా తీర్థంకరుల బోధనలను బుద్ధుడు ‘హైజాక్’ చేసి తనవిగా ప్రచారం చేసుకున్నాడు. అహింస, నీతి, విలువలు, సభ్యత, సంస్కారం, మానవీయ అంశాల గూర్చి బుద్ధుని సమకాలీన తీర్థంకరులు గొప్పగా ప్రతిపాదించి ప్రచారం చేశారు. అంతకుముందూ అవి ప్రచారంలో ఉన్నాయి.
ఎనభై ఏళ్లు జీవించిన బుద్ధుడు చివరి మూడు- నాలుగు దశాబ్దాలు తన ప్రతిపాదనలను ప్రచారం చేశాడు. వాస్తవానికి అంతకుముందు ఎనిమిది వేల సంవత్సరాల మానవ జీవన ప్రస్థానంలో చోటుచేసుకున్న సంస్కరణలు, నూతన భావనలు తీసివేయదగ్గవి కావు. అన్నిరకాల రుగ్మతలకు పరిష్కార మార్గాలను పాలకులు, వారి తరపు మంత్రులు, రుషులు సూచించారు. అనేక విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు జ్ఞానాన్ని ప్రోదిచేశారు. పాత ఒక రోత.. కొత్త ఒక వింత... అనే మాట లోకంలో అనాదిగా ప్రచారంలో ఉంది. బహుశా కపిలవస్తు యువరాజు సిద్ధార్థుడు బోధి వృక్షం కింద ధ్యానం చేయడం ఆనాటి ప్రజలకు కొత్తగా అనిపించి ఉంటుంది, వింతగా తోచి ఉంటుంది. దానికితోడు బ్రాహ్మణులు బుద్ధునికి జైకొట్టడంతో.. వారి ధారణాశక్తి, జ్ఞానబలం, వ్యవహార శైలి బుద్ధునికి ఉపకరించి బౌద్ధ విస్తృతి జరిగి ఉంటుంది.
సరే- రెండున్నర వేల సంవత్సరాల క్రితం బుద్ధుని బోధనలు కొత్తవి కావచ్చు. తన బోధనలు కేవలం ఐదువందల సంవత్సరాల పాటే ప్రభావం చూపుతాయని స్వయంగా తథాగథుడే పేర్కొన్నప్పటికీ ఆ గడువు దాటిపోయి రెండువేల సంవత్సరాలు గడిచినా ఇంకా ఆ బోధనల ప్రభావం ఉంటుందని, ఉండాలని 2019 సంవత్సరంలోనూ ఆశించడం అత్యాశ గాక ఏమవుతుంది? కోర్కెలను, ఆశలను అదుపులో పెట్టుకోవాలని చెప్పినవారే అత్యాశకు పోతే ఎలా? సమాజం మారింది. మనిషి చుట్టూ వాతావరణం మారింది. రాచరికాలు పోయి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. సైన్స్ సరికొత్త ఎత్తులకు చేరంది. అది మనిషి జీవితాన్ని గతంలోకన్నా ఎక్కువ ప్రభావితం చేస్తోంది. మనిషి తనకు ఎదురయ్యే సమస్యలను, బాధను, దుఃఖాన్ని పరిష్కరించుకునేందుకు అనేక విధానాలను, పద్ధతులను రూపొందించుకున్నాడు. ఆ ‘రిమోట్ కంట్రోల్’ తన దగ్గరే పెట్టుకున్నాడు. అందుకే అతి తక్కువ కాలంలో అనూహ్య అభివృద్ధిని సాధించగలుగుతున్నాడు.
విచిత్రమేమిటంటే- రోగి, వృద్ధుడు, శవాన్ని చూసి సిద్ధార్థుడు చలించిపోయి.. వాటికి పరిష్కారం కనుక్కునేందుకే తన అనే్వషణ, ధ్యానం ప్రారంభించారని చెబుతారు. కాని వర్తమానంలో ఆ పనిని సైంటిస్టులు కచ్చిత్వంతో చేస్తున్నారు. పరిష్కారం వైపు కదులుతున్నారు. బౌద్ధాన్ని ఆచరిస్తున్న జపాన్‌లోనే వీటిపై పరిశోధనలు జోరుగా జరుగుతున్నాయి. కృత్రిమ మేధ ఆధారంగా రోబోలు మానవుల పనులన్నీ చేస్తున్నాయి, చోదక రహిత కార్లు రోడ్ల మీదకు రాబోతున్నాయి. జ్ఞానానికి నిజమైన నిర్వచనం కనిపిస్తోంది. బుద్ధుడు ఆశించిన పరిష్కార మార్గాలను వర్తమాన శాస్తవ్రేత్తలు, వైజ్ఞానిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ పురోగమనాన్ని కళ్ళతో చూస్తూ, శాస్తవ్రేత్తలు చూపిన మార్గాన్ని విస్మరించి రెండున్నర వేల ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాటల్ని స్మరిస్తూ ‘జ్ఞానోదయం’ కోసం ‘ ధ్యానం’ చేయడం, బోధి వృక్షం కింద ధ్యానం చేస్తే ఫలితం మరింత తొందరగా వస్తుందని బోధ్ గయకు పయనమవడంలో ఏమైనా అర్థం ఉందా? 21వ శతాబ్దంలో వేలం వెర్రిగా బయలుదేరితే ఎలా?

-వుప్పల నరసింహం 99857 81799