Others

వినయమే ‘చిరు’సంపద (ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై.. కోడంబాక్కం రంగరాజపురంలో పబ్లిసిటీ ఆర్టిస్టు గంగాధర్ ఇల్లు ఎప్పుడూ వచ్చిపోయే ఫిల్మ్ సెలబ్రిటీస్‌తో కళకళలాడుతుండేది. పబ్లిసిటీ ఆర్టిస్ట్ గంగాధర్, రామారావు, ఈశ్వర్ ముగ్గురూ కేతా మాస్టారి దగ్గర పని చేసేవారు. విడిపోయి ఎవరికివారు సొంతంగా పబ్లిసిటీ వర్క్ ప్రారంభించారు. వీరిలో ఈశ్వర్, గంగాధర్ బిజీగా వుండేవారు. ఇందులో ఈశ్వర్‌కి సహనం తక్కువ. కట్టె కొట్టె తెచ్చెలా వుంటుంది వ్యవహారం. అయితే పనిమంతుడు గంగాధరం అలాకాదు. సౌమ్యుడు. మృదుభాషి. అన్నగారికి అత్యంత ప్రీతిపాత్రుడు. మల్లెమాలకి మానస పుత్రుడు. ఆ రోజుల్లో మల్లెమాల ప్రోద్బలంతోనే ఫిల్మ్‌నగర్‌లో స్థలం తీసుకున్నాడు గంగాధర్.
గంగాధర్‌ది మంచి హ్యాండ్ అని నమ్మేవారు. ఆయన చేత్తో ఏది ప్రారంభించినా దేదీప్యమానంగా వెలుగుతుందని విశ్వాసం. అందుకని చాలా సినిమా కంపెనీలు సినిమాల ప్రారంభానికి ముందే గంగాధర్ చేత లెటరుహెడ్ డిజైన్ చేయించి స్క్రీన్ ప్రింటింగ్ చేయించుకొనేవారు. అప్పట్లో కంప్యూటరూ డిజైనింగ్ ఏమీలేదు. ఎంతయినా మాన్యువల్‌గా కష్టపడి డిజైన్ తయారు చేయడమే. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైతే రాత్రి పదీ పదకొండు గంటల సమయం పట్టేది. ఒక్కోసారి సినిమా విడుదల సందర్భంలోనైతే నైటవుట్ చేసేవాళ్లు. అటువంటి సమయంలో భలే సరదాగా వుండేది. మాటలూ.. పాటలూ.. జోకులూ.. నవ్వులూ.. కేరింతలతో రాత్రి ఇట్టే గడిచిపోతుండేది.
ఒకరోజు నేనూ గంగాధర్ ఏదో డిజైన్ విషయంలో కుస్తీపట్లు పడుతున్నాం. రేపు ఉదయం నాలుగున్నర గంటలకు నాలుగు డిజైన్లూ ఓకే చేయించి పబ్లిసిటీకి రిలీజు చెయ్యాలి. డిజైన్ ఎలావుంటే ఆయన ఓకె చేస్తాడో మాకు తెలుసు. అందుకోసమే కుస్తీపట్లు. ఇంతలో ఒక యువకుడు వచ్చాడు. అతడి పేరే చిరంజీవి. అప్పటికి పునాదిరాళ్లు చిత్రంలో నటించడం కూడా జరిగింది.
ఎవరో పంపించారేమో అనుకున్నాం. కానీ ఆయన కావాలనే వచ్చాడు. చిరంజీవికో లెటరు హెడ్ కావాలిట. ఫాన్ మెయిల్ రాయడంకోసం. హనుమంతుడు లైన్ డ్రాయింగ్ వుండాలంట. చి..రన్ (ఇంగ్లీషులో వుండాలిట) జీవి. మొత్తం ఫాస్ట్ లెటరింగ్‌తో ఒక లెటరుపాడ్‌కి డిజైన్ కావాలని రిక్వెస్టింగా అడిగాడు. గంగాధర్ తన నిస్సహాయ స్థితిని చెప్పి వారం తర్వాత కనిపించు బాబూ. నీ ఐడియా నాకర్థమయ్యింది. బావుంది. చాలా బావుంది! వెళ్లిరా బాబూ!’ అని పంపించేశాడు గంగాధర్.
సరిగ్గా వారం తర్వాత చిరంజీవి ప్రత్యక్షం. గంగాధర్‌కి గుర్తుంది. ఎపుడో డిజైన్ గీసి సిద్ధింగావుంచాడు. అదిచ్చి మనస్ఫూర్తిగా దీవించి పంపించాడు. తరువాత చిరంజీవి సూపర్‌స్టార్ అయ్యాడు. మెగా హీరో అయ్యాడు. గంగాధర్‌ని మరిచిపోలేదు.
అలాగే ‘లవ్ ఇన్ సింగపూర్’లో రంగనాథ్ హీరో. చిరంజీవిది ఆల్ట్రామాడ్రన్ క్యారెక్టర్. అప్పట్లో రంగనాథ్‌ని చిరంజీవి అన్నయ్యా అంటూ పిలిచేవాడు. చాలా సినిమాల్లో నటించారు. చిరంజీవి కేంద్రమంత్రిగావున్న సమయంలో రంగనాథ్ భార్య చైతన్య శివసాయుజ్యం పొందింది. ఆ విషయం తెలిసి అంత బిజీలోనూ వెదుక్కుంటూ వచ్చి రంగనాథ్‌ని పరామర్శించి వెళ్లాడు.
ఎబికె ప్రసాద్ ‘్భవనవిజయం’ నృత్య రూపకం రవీంద్రభారతిలో అరేంజ్ చేశారు. ఫోన్లో చెప్పినంతమాత్రాన చీఫ్ గెస్ట్‌గా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. చిరంజీవి వ్యక్తిగా ఎదిగినా ఎన్ని ఉన్నత పదవులు అధిరోహించినా ఆరోజు ఎలా వున్నాడో ఈరోజూ మాముందు అలాగే వున్నాడు. అదే వినయం! అదే విధేయత! అదే పెద్దలపట్ల గౌరవం! ఏయన్నార్, యన్‌టిఆర్‌ల తర్వాత వారి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిగా చిరంజీవిని చెప్పుకోవచ్చును.

-ఇమంది రామారావు 9010133844