Others

ఆదర్శమూర్తులు సీతారాములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సజ్జనులకు మనసున మలయమారుతాలు వీస్తే శత్రువుల గుండెల్లో అతిభీకరమైన ప్రచండమైన ప్రళయం సంభవిస్తుందని రాముని గూర్చి మారీచుడు రావణుని హెచ్చరించాడు. పోయే కాలానికి విపరీత బుద్ధి పుట్టినట్టు రావణుడు ఒక్కమారీచుని మాటే కాదు తన స్వంత భార్య మండోదరి చెప్పినా వినలేదు. తమ్ముడు చెప్పినా అర్థం చేసుకోలేని వాడు రావణుడు కనుక రాముని చేతిలో అసువులు కోల్పోయాడు.
రాముని గూర్చి మొట్టమొదట లోకానికి వాల్మీకి మహర్షి తెలియబర్చాడు.మునులు, సిద్ధులు, సాధువులే కాదు సాధారణులు కూడా రామ నామంతో చిరపరిచితులైనట్లుగా ఆనందాన్ని అనుభవిస్తారు. నాటి నుంచి నేటిదాకా రాముని తనవాడు అనుకోని వారు ఎవరూ లేరు. జాతి భేదం కానీ ప్రాంతీయభేదాలు కానీ లేకుండా రాముని గూర్చి తెలుసుకొనేవారు రాముని బాట లో నడిచే కోకొల్లలుగా ఉంటారు.
రాముడు తాను దేవుడని ఏనాడు చెప్పలేదు. బ్రహ్మాది దేవతలు వచ్చి అయ్యా నీవు నిజంగా మహావిష్ణువే అని చెప్పినా అదంతా నాకు తెలియదు కానీ ఇపుడు మాత్రం నేను దశరథ పుత్రుడిని దాశరథిని అని చెప్పాడు. మానవుడుగా అవతరిస్తానని చెప్పి అవతరించాడు కనుక తన ధర్మాన్ని తాను పాటించాడు. తనకు వచ్చిన కష్టాలను ఒక మనిషిగానే సాధించాడు కానీ అపూర్వమైన మహిమలతో విజయాన్ని సాధించ లేదు. మనిషిగా పుట్టినవారు ఏవిధంగా ధర్మ మూర్తులుగా కాలం గడపవచ్చో రాముని అయనాన్ని చూసి నేర్చుకోవచ్చు.
ఇటువంటి ధీరచరిత్ర కలిగిన రామునికి సీత సహధర్మచారిణి. అక్కడక్కడా సీత సున్నిత హృదయురాలుగానో, లేక అనుమానించే అబల గానో కనిపించినా అదంతా కూడా తన మాటను నెగ్గించుకోవడానికి వేసిన పథకపుటా లోచనలే అనిపిస్తాయ. స్ర్తీజాతికే మణిపూసగా పేరు తెచ్చుకుంది. అందరూ సీతారాముల్లా అనురాగ మూర్తులుగా ఉండమని కీర్తించే విధంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంది. ఏనాడు తనకొచ్చిన కష్టానికి ఇతరులను నిందించలేదు. భోగాలు కావాలని కోరలేదు. ఉన్నదానిలోనే సంతృప్తిగా జీవించి స్ర్తిలందరికీ ధీరోదాత్తత, స్థితప్రజ్ఞత కలిగిన ఆదర్శమూర్తిగా నిలిచింది.

- జి. వివేక్