Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరుపోసె జానకమ్మ అడవిలోని మొక్కకైన
చేరదీసె రామయ్యయు కొండపైని కోతినైన

భీషణుడై విభీషణుడు ధర్మముకై పోరాడెను
లంకవీడి శ్రీరాముని అంకమ్మున తా జేరెను

అహరహమును విరహమందు రగిలిపోయె నూర్మిళమ్మ
తన గుండెను తన స్వామిని నిలుపుకొనియె హనుమన్న

తృణప్రాయం సామ్రాజ్యం అని యెంచుచు భక్తిమీర
పాదుకలకు పట్టమిడుచు వెలిగిపోయె భరతుండు

కనకమృగం కనకనిజం కాంక్షించెను జానకి
కనకమె మృగమంచు నెంచి కడతేర్చెను రాముండు

తన స్వామిని తన కన్నుల నిలుపుకొనియె శబరి
పద్మమట్లు శ్రీరాముని పదములపై రాలినది

పది తలలను కామమ్మే పడగెత్తిన రావణుండు
తన మరణమె తన ముక్తికి దారియంచు నెంచినాడు

పతిని బాసి పరుల చెరను కన్నీరాయెను సీత
పతిని బొంది నిందజెంది అగ్నిపరీక్షలో గెలిచెను

ప్రజల మాట తలదాల్చుచు పడతిని విడనాడుచు
అనల కిరీటం ఔదల దాల్చినిల్చె రాముండు

వనవాసమె తనవాసమ్మంచు నెంచికొంచును
బ్రతుకంతా అడవిగాచు వెనె్నలాయె జానకి

తల్లియందు తలిదండ్రుల జూచుకొంచు మెలగుచు
వీర్యశౌర్యముల తండ్రినె మించినారు కుశలవులు

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087