Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడా ఋక్షుడు ఒక జడలమర్రి క్రింద మెత్తని, పచ్చికమీద పద్మాసనం వేసుక్కూచుని ‘‘మరా! మరా!’’యంటూ రామ నామ జపాన్ని చేయసాగాడు.
దానితో ఆతనికి జ్ఞాననేత్రం తెరచుకుంది. సహస్రారం విచ్చుకుంది. అమృతం బొట్లుబొట్లుగా ఆతని నాల్కపై వర్షించసాగింది. ఎనె్నన్ని జన్మల పుణ్యఫలమో! అతడు ఆకలిదప్పుల్ని మరిచాడు. ఒక ధవళ నక్షత్రంలా వెలుగులీనసాగాడు. ఆతని శరీరంపై చీమలు, దోమలు ప్రాకులాడాయి. తుమ్మెదలు గూళ్ళుకట్టుకున్నాయి. ఐనా, అతడు చలించలేదు. కళ్ళు తెరవలేదు. గంటలు దినాలుగా, దినాలు నెలలుగా, నెలలు వత్సరాలుగా మారిపోయాయి. ఆతని శరీరంపై ఒక వల్మీకం పెరిగిపోయింది. ఆ పుట్టలో ఒక పుట్టలా కూర్చుని అతడు తపస్సుచేశాడు. అందుకే అతడు ‘వాల్మీకి’యని పిలువబడ్డాడు.
కొంతకాలానికి అతని తపస్సు ఫలించింది. సరస్వతీ సమేతుడైన బ్రహ్మప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు.
‘‘ఏంకావాలి నాయనా?’’అంటూ ప్రశ్నించాడు.
‘‘జ్ఞానం! జ్ఞానం! జ్ఞానం!’’అంటూ ముమ్మారులూ ఉచ్ఛరించాడతను.
‘‘తథాస్తు!’’అంటూ వారనుగ్రహించి, అంతర్థానమయ్యారు.
ఆయన నాల్కపై ‘వేదత్రయం’ నాట్యమాడింది.
ఆయనకు దివ్యదృష్టి ప్రసాదించబడింది.
ఆతడొక మహత్తర నక్షత్రంలా వెలుగులీనుతూ, వానప్రస్థానంలోకి వెళ్ళాడు. తమసానదీ తీరాన ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తన శిష్యులతో వసించసాగాడు.‘‘
ఐతే,
ఆయన రామాయణ మహాకావ్య రచనకి ఎప్పుడు? ఎలా పూనుకున్నాడు’’?
‘‘ఒకరోజు ఆతనికి మళ్ళీ నారద మహర్షి దర్శనమిచ్చాడు. ఒక వెండి కొండలా భూమీదకు దిగాడు మహర్షి. ఒక మెరుపు తీగలా మెరిసిపోతున్నాడు! ఆయన దుస్తులు దూదిపింజల్లా, మబ్బుల్లా గాలిలో తేలిపోతున్నాయి!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087