Others

‘గురు’తర బాధ్యత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతి పురోగతిలో ఉపాధ్యాయుల పాత్ర విస్మరించరానిది. ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అక్షరాస్యత ముఖ్యమనే విషయం కాదనలేని అంశం. విద్యారంగం దేశానికి గుండె వంటిది. ఆ రంగం ఆగిపోతే దేశానికి కావాల్సిన రక్తప్రసరణ ఆగిపోయినట్లుగా ప్రముఖ విద్యావేత్తలు పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నప్పటికీ- నేటి విద్యారంగం దోపిడీకి లైసెన్స్ ఉన్న మాఫియా వ్యవస్థగా మారిందని చెప్పవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి విద్యాసంవత్సరం ప్రాథమిక పాఠశాలల నిర్వహణకు, ఉపాధ్యాయుల జీతభత్యాలకు దాదాపు 1,000 కోట్లు ఖర్చుపెడుతున్నారని ఒక అంచనా. ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక కళాశాలలు, మెడికల్ కళాశాలలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చుపెడుతున్నాయి. ఇంత స్థాయిలో ఖర్చుపెడుతున్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మాత్రమే తమ పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు ఎందుకు ఆసక్తిచూపిస్తున్నారన్న అంశంపై ప్రభుత్వాలు దృష్టిసారించడం లేదు.
కొన్ని ‘బ్రాండెడ్’ విద్యాసంస్థలు శాఖోపశాఖలుగా విస్తరించి నిబంధనలు తుంగలోతొక్కి ఫీజుల ముసుగులో దోపిడీని కొనసాగిస్తున్నాయి. ఈ పేరొందిన విద్యాసంస్థలలో తమ పిల్లలు చదవకపోతే వారికి మంచి భవిష్యత్ ఉండదన్న ప్రచారం జరుగుతోంది. తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు పంపే తల్లిదండ్రులు తెలివిలేని వారన్న భావన ప్రస్తుతం మన సమాజంలో నెలకొంది. తమ పిల్లల్ని మంచి స్కూళ్ళలో చదివించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుని మరీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. అందరికీ విద్యను అందించాలనే అతి ముఖ్యమైన ప్రాథమిక బాధ్యత నుండి ప్రభుత్వం క్రమంగా తప్పుకొంటోంది. దీంతో విద్యారంగం ప్రైవేటీకరణకు ప్రభుత్వమే ద్వారాలు తెరిచినట్టయ్యింది. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు విచ్చలవిడిగా విద్యాసంస్థలు నడుపుకోవడానికి పాలకులు అనుమతి ఇవ్వడంతో ఇది మాఫియాగా విస్తరిస్తోంది.
దాదాపు 90 శాతం విద్యాసంస్థల అధినేతలు ఏదో ఒక రాజకీయ పార్టీలో కీలకస్థాయిలో పనిచేస్తుండటం, వారు సిండికేట్‌గా మారడం, ప్రభుత్వాల అండదండలు పుష్కలంగా ఉండటంతో విద్యా వ్యవస్థలో వాణిజ్య ధోరణులు విజృంభిస్తున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న వ్యాపారాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, ప్రైవేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దాలని సమాజం బలంగా కోరుకుంటోంది. ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోయడం కేవలం విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కనిపిస్తోంది. ఆ తర్వాత దీన్ని అందరూ మర్చిపోతున్నారు. విద్యా సంవత్సరం మొదలయ్యే సమయంలో ఇది షరామామూలే!
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రారంభం నుంచే కనీసం 35-40వేల రూపాయల వేతనం ఉండగా, సీనియారిటీ ఉన్న టీచర్లకు 70 నుంచి 80 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. మంచి వేతనాలు పొందుతున్న అధ్యాపకులలో కొందరు తమ విధుల పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. గ్రామాల్లో ఉండకుండా, సమీప పట్టణాల్లో కాలక్షేపం చేస్తూ కొందరు టీచర్లు ఇతర వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. ఈరోజు ప్రభుత్వ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారిలో చాలామంది తాము గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివి వచ్చినవారమనే విషయాన్ని విస్మరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వసతులు సరిగ్గా లేవని, తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయడం లేదని విమర్శలు చేయడం కొందరికి అలవాటుగా మారింది. ఇక, వివిధ అధ్యాపక సంఘాల్లో నేతలుగా చెలామణి అవుతున్న వారు ఆధిపత్య పోరులో విధుల్ని, విలువల్ని గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్షా 30వేల మందికి పైగా ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవన్నది నిజం. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఫలితాలే ఇందుకు నిదర్శనం. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను గుర్తుంచుకోవడమే గురువుల బాధ్యత కావాలి. విద్యారంగం కుప్పకూలితే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. తరగతి గది నిర్వీర్యమైతే దేశమే చీకటిగా మారిపోతుంది. నూతన విద్యా సంవత్సరంలోనైనా ఒక్కసారి అధ్యాపక వర్గం ఈ దిశగా ఆలోచించి, దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో విధి నిర్వహణకు అంకితం కావాలి.

-సురేష్ కాలేరు