Others

ఈసీపై విశ్వసనీయత ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ తీరు వంకపెట్టలేనిదేమీ కాదు. అలా అని ఆ సంస్థ నిర్ణయాలను నిందిస్తూ కూర్చున్నా ఫలితం ఉండదు. నిష్పక్షపాతంగా దాని పనితీరును మదింపుచేసి లోపాలను, బలహీనతల్ని అధిగమించేలా పనిచేసేలా ఎలా తీర్చిదిద్దాలో ఆలోచించాలి. ఈసీ పనితీరును ఎత్తిచూపే రాజకీయ పార్టీలు- తాము అధికారంలోకి వస్తే ఎలా దాన్ని బలోపేతం చేస్తామో చెప్పాలి. అందుకు తగ్గట్టు హామీ ఇవ్వాలి. ఆ రాజ్యాంగ సంస్థను అధికార పక్షం ‘పంజరంలో చిలుక’గా మార్చేసిందని చెప్తున్న ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో అదేపనిగా ఆరోపణలు చేసినా ప్రయోజనం లేదు. అర్థవంతమైన ప్రశ్నలు, నిలదీతలు ఉండాలి. లక్షలాది ఓట్లు గల్లంతు కావడం ఎన్నికల కమిషన్ పనితీరుకు శోభనివ్వదు. సరికదా దాన్ని బాధ్యతారాహిత్యంగా జనం అనుకోవాల్సి వస్తుంది. ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తపరిచినపుడు, ఆ సందేహాన్ని ప్రాక్టికల్‌గా నివృత్తిచెయ్యాలి తప్ప, అడిగినవారి డిగ్రీలు, అర్హతల గురించి మాట్లాడకూడదు. ఇక ప్రతిపక్షాలు 50 శాతం వీవీపాట్‌లను విధిగా లెక్కించాలని కోరడంలో ‘లాజిక్’ తెలియడం లేదు. ఈవీఎంల నిక్కచ్చితనంపై సందేహం ఉంటే తేల్చుకోడానికి అంత స్థాయిలో శాంపిల్స్ అక్కరలేదు. ర్యాండమ్‌గా కొంత శాతం సరిపోతుంది. వాటిని ట్యాంపర్ చేసి, ఫలితాల్ని ప్రభావితం చేశారేమో అనుకున్నా అప్పుడు 50 శాతం వీవీపాట్‌లను లెక్కించినా ప్రయోజనం ఉండదు. 99 శాతం లెక్కించినా మిగిలిన ఒక్క శాతంలో గడబిడ జరిగి ఫలితాలు తారుమారు కావొచ్చు కదా! అప్పుడు నూటికి నూరుగా లెక్కలోకి తీసుకోవాలి కదా. కాబట్టి విశ్వసనీయత అన్నది అయితే సంపూర్ణం లేదా సున్నా తప్ప కొంచెం కొంచెంగా ఉండదు. 50 శాతం లెక్కింపుతో ప్రయాస తప్ప, విశ్వసనీయత ఏముంటుంది? అయితే అందరూ ఒప్పుకోవాల్సింది ఒకటి. ఎన్నికల కమిషన్‌కి పూర్తి స్థాయిలో స్వయం ప్రతిపత్తి ఉండాలి. స్వతంత్ర నిర్ణయాలు అమలుచేసే శక్తి ఉండాలి, తగినంత మంది సిబ్బంది ఉండాలి. కఠిన చర్యలు తీసుకోగల అవకాశం ఉండాలి. అలాచెయ్యాలంటే అవసరమైన రాజ్యాంగ సవరణలకు ఒప్పుకునే పార్టీలుండాలి. రేపు అధికారంలోకి రాబోయే వారికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఎన్నికలు ముగిశాక, తమకు ఇబ్బంది కలిగించే సంస్కరణలకు వత్తాసు పలికేలా పార్టీలు ఆలోచిస్తాయా? అన్నది పెద్ద ప్రశ్న. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆ తరహా సంస్కరణలు అవసరం.

-డా. డీవీజీ శంకరరావు