AADIVAVRAM - Others

గతించిన ఆ రోజులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరిగిరాని నిన్నటిని తలచుకొని
తల్లడిల్లుతున్నాము
ఏవి ఆనాటి రోజులు
కాలానుగుణంగా మనిషికి
నేనున్నానంటూ ఆసరాకి
చేయి అందించిన
మానవతా మూర్తులు

ఆరుగాల పంటలని పండించే
రైతైనా ఆకలంటు
వచ్చినవాడి కడుపు
నింపిన సంతోషపు రోజులు
కేవలం కొన్ని మిగిలిపోయే
గుర్తులేనా

గనుల్లో కార్ఖానాల్లో
శ్రామికశక్తి మేధోమదనం తోడై
ప్రగతిపథంలోకి నడిపించిన
రేపటి తరపు ఆనవాలు
చరిత్రకి సాక్షీభూతమేనా
మనుగడకి కేవలం డబ్బే కాదు
అంతకు మించిన
సంస్కార సంపదని
వ్యాపింపజేసిన సంస్కర్తల
జీవితాలన్నీ
కాగితంలో కథలేనా

ఆనాటి రోజులెంత మంచివి
కష్టాల్లో కూడా ఆనందాన్ని
వెతుక్కునే
మంచితనపు పరిమళాలకి
పట్టం కట్టి ఊరేగించలేదు

మానవ సంబంధాలన్నీ
ఆర్థిక బాంధవ్యాలుగా మారిన
నేటి నయా స్వార్థపు లోకంలో
ఆనాటి సత్యాలన్ని
చాదస్తాలుగా
కొట్టివేయబడతాయి

నీతి నిజాయితీ
నైతికతని తరిమేసి నిస్సిగ్గుగా
తప్పే వొప్పుగా మార్చిన
నేటి దుర్మార్గపు రోజులని
తల్చుకొని కుమిలిపోతున్నా

గతించిన ఆ రోజుల ప్రాభవం
మళ్లొకసారి నా ప్రపంచానికి తీసుకురావాలన్నది నా లక్ష్యం!

-పుష్యమీ సాగర్ 9010350317