Others

తెలుగులో తొలి కందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రాచీన భాష కాదనే వాదనలకు ముగింపు పలికి, ప్రాచీన భాష (క్లాసికల్ లాంగ్వేజ్) హోదా పొందుటకు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తొలి తెలుగు కంద పద్యాలు విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అటు కన్నడిగులకు, ఇటు తెలుగు వారికి సదరు కంద పద్యాలు కలిగిన కురిక్యాల శాసనం అమూల్యమై, ప్రధాన ఆధారంగా మారింది. కరీంనగర్‌కు 18కిలోమీటర్ల దూరాన జగిత్యాల వైపున గంగాధర్ ఎక్స్‌రోడుకు 3 కిలోమీటర్ల దూరంలో కురిక్యాల గ్రామం దాటాక 200మీటర్ల ఎత్తున బొమ్మల గుట్టపై క్రీ.శ.946కు సంబంధించిన జినవల్లభుడు వేయించిన 11పంక్తుల శాసనంలోని మూడు తెలుగు కంద పద్యాలు ఆదికవిగా భావించే నన్నయకు శతాబ్దపు పూర్వపు కాలానికి చెందినవిగా గుర్తించారు.
ఇవి తెలుగు భాష ప్రాచీనత్వ గుర్తింపుకు మూలాధారాలైనాయి. కన్నడ పద్యాలకు యతి మాత్రమే ఉండగా, తెలుగు పద్యాలు యతి ప్రాసలు రెండు కలిగి తొలి సంప్రదాయ ఛందోబద్ద కందాలుగా చరిత్రలో నిలిచి పోయాయి. వేములవాడను ఏలిన చాళుక్యరాజు రెండవ అరికేసరి (క్రీ.శ.930-955) కోరికపై, ఆయన ఆస్థాన పండితుడైన పంప మహాకవి కన్నడంలో తొలి కావ్యమైన ‘‘విక్రమార్జున చరిత్ర’’ను రాసి, అంకితమిచ్చినందుల కు కృతిపతి కృతజ్ఞతా సూచకంగా పంపనికి ద్విజావసధ బ్రాహ్మణ గ్రామమైన ‘‘్ధర్మపురి’’ అగ్రహారాన్ని దానంగా ఇచ్చినట్లు శాసనంలో ఉంది. సంస్కృత కన్నడాంధ్ర త్రిభాషా శాసనాన్ని పంపని తమ్ముడైన జినవల్లభుడు వేయించాడు. ‘‘వినుత చాళుక్య వంశపతి మిక్కరి కేసరి సన్ద విక్రమార్జున విజయక్కె ధర్మపురం మెన్దు మదేయ మిదెన్దు కీర్తి శాసన’’ అని 7వ పద్యంలో పేర్కొనబడింది.
వాగ్వధూ వల్లభ, సకల కళా ప్రవీణ, భవ్య రత్నాకర, గుణ పక్షపాతి లాంటి అనేకానేక బిరుదుల గల జినవల్లభుడు బొమ్మల గుట్టపై జిన విగ్రహాలు చెక్కించి, వేములవాడ సమీపాన జినాలయాన్ని నిర్మించి, పంపని పేరున చెరువును తవ్వించి, మదన విలాసమనే వనాన్ని నిర్మించినట్లు పరిశోధకులు తేల్చి చెపుతున్నారు. కురిక్యాల శాసన నిర్మాతయైన జినవల్లభుడు వేయించిన శాసనంలోని మూడు కందపద్యాలు ఇలా ఉన్నాయి.
కం.. జినభవనములెత్తించుట;
జన పూజల్సేయుచున్కి జిన మునులకు న
త్తిన యన్న దానం బీవుట;
జినవల్లభు బోల గలరె జిన ధర్మపరుల్...

కం.. దిన కరుసరి వెల్గుదుమని
జినవల్లను నొట్టనెత్తు జితకవి ననుమన్ మనుజుల్గలరే ధాత్రిన్
వినితిచ్చుదు ననియవృత్త విబుధ కవీన్ద్రుల్..

కం.. ఒక్కొక్క గుణంబు కల్గుదు
రొక్కణ్ణిగా కొక్కలక్క లేదెవ్విరికిం
లెక్కింప నొక్కొలక్కకు
మిక్కిలి గుణ పక్షపాతి గుణమణి గుణముల్..

చిత్రాలు.. కురిక్యాల సమీప బొమ్మల గుట్ట

*బొమ్మల గుట్టపై చక్రేశ్వరి (యక్షిణి), తీర్థంకరుల విగ్రహాలు
*బొమ్మల గుట్టపైనున్న కురిక్యాల శాసనం

- సంగనభట్ల రామకిష్టయ్య