Others

నువ్వు గెలిచేవాడివే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దారి లేని అడవి..
పంజా విప్పి తెల్ల పెద్దపులి
అణువు గుండెనిండా
రేపును ఛిద్రం చేసే
నివురు గప్పిన విస్ఫోటనాలు
వీరుడా.. నువ్వెలా యుద్ధం చేస్తావ్

బోసి నవ్వులకు ఊపిరిలూదే
పిల్ల వాయువులు ఉండబోవు
నువ్వు బంధించిన అరచేతిలోని
సూర్యకిరణాలు నిన్ను ఒంటరి చేస్తాయ

మెలకువ కలల్ని మింగే
పడమటి కొండలు
పగలబడి నవ్వుతాయ
వీరుడా నువ్వొక ప్రశ్నవై ఎలా తలెత్తగలవ్

ప్రతి అడుగులో నిశ్శబ్దంగా
ఒక కందకం వేచిచూస్తుంది
ఈనాటి ముద్దులాటలన్ని రేపు
అసూయల చిరునామాలవుతాయ
ఇప్పుడు నిన్ను తనలోకి
అనువదించుకునే వాళ్లందరిని
నువ్వు రేపు అనువదించక తప్పదు
వీరుడా... అడుగు ముందుకే...

చీకటి లోయలు.. అరణ్యాలు
అర్ధరాత్రి ఆకాశమూ... ఒంటరి నక్షత్రమూ
ఉన్నట్టుండి పేలుతున్న మందుపాతరలు
నువ్వెక్కుతున్న పర్వతం కొసల నుండి
నిన్ను క్రిందికి నెట్టుతూ
వస్తున్న బండల వానలు
పసివాడా... నీ దారి ఏది?

మెదడులో ప్రపంచాన్ని బంధించేవాడా
మహా వృక్షాలను నిశ్శబ్దం చేసి
ఈదగలిగేవాడా
శే్వతసుందరి తెల్లని భయంకరమైన నవ్వును
త్రుటిలో తిరస్కరించేవాడా
ఏనాటికైనా నువ్వు గెలిచేవాడివే..

- డా. కాంచనపల్లి, 9676096614