Others

పాపం.. వాటికేమీ తెలియదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగ రోజున ప్రశాంతతని వెతుకుతూ
కొన్ని పక్షులు దేవుడి ముందు మోకరిల్లితే

కష్టాలని, బాధల్ని ఆనందాల్ని దయగల
తండ్రితో మొరపెట్టుకుంటే

భిన్న సమూహాలన్నీ ఒక్కటై
సమారాధనని జరుపుతూ సంతోషపడదామని

పాపం అమాయక పక్షులు కొన్ని తలపోస్తే
ఉరుములేని మెరుపులా
ఎక్కడినుంచో బాంబుల జడివాన

చేతులు జోడించి లోకమంతా మంచి చేయమని
ప్రార్థించడం తప్ప
పాపం వాటికేమి తెలుసు?

పునర్జీవితుడైన ప్రభువు చెంతనే
మరణ శాపాన్ని లిఖించిన రాక్షసులెవరో తెలియకుండానే
కనుమూసాయి

ఉగ్రం వెర్రితలలు వేస్తున్న
నాగరిక ప్రపంచంలో విధ్వంస వినోదానికి

పక్షులే బలిహరణ

జాతులు, మతాలూ కల్మషాలు
ఇవేవీ తెలియని మామూలు అమాయక పక్షులవి

రెక్కాడితే డొక్కాడని పేదరికానికి
పండుగరోజు కడుపు నింపుతుందని ఎగిరివొచ్చిన
పక్షులకి తామే బలికూడని తెలియదు

వేల మైళ్ళ విస్తీర్ణాలని లెక్కచేయక
ఎగురుకుంటూ వొచ్చి

దేవుడి సన్నిధికి చేరిన పక్షుల
తలరాతలని ఆటవిక క్రూరత్వం నిర్ణయించే

మృగత్వానికి రాక్షసత్వానికి ప్రతీకలైన
ఉగ్రవాదానికి బలైనవి
కొన్ని అమాయక పక్షులు

తప్పుకి కఠిన శిక్ష పడనంతవరకు
ప్రాణాలు మూల్యంగా చెల్లించాల్సిందే..

- పుష్యమీ సాగర్ 90103 50317