Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరమ్ములు పారినట్లు- నీరదములు కదలినట్లు
గాలి సంచరించినట్లు- కదలె నతని మూర్తి

తృణములపై తృణములట్లు- చరణమ్ములు పడెను
అణువులపై అణువులట్లు- అతని తనువు కదలెను

చీమ మడియు దోమ మడియు సంచుకృంద సాగెను
పదిలమ్ముగ పొదమ్ముల కదలించుచు సాగెను

కనులలోని కనుపాపలు చరణమ్ముల జేరినట్లు
ఒడలెల్లను కనులు మొలచి నయనమ్ములె నడచినట్లు

నడవసాగె నా మహర్షి- నడవసాగె నతడు
నదిని సాగు పడవ వోలె సాగసాగె నతడు

కమలమంచు ముఖము జేరు భ్రమరమ్ముల ద్రోలబోక
భూరుహమని భుజముపైని చేరుపక్షి నదలించక

ముళ్ళపొదను చిక్కినట్టి- పక్షిని బయటకు తీయుచు
ఒడ్డున గిలగిల లాడెడు- చేపను నీటను త్రోయుచు

నీటిలోన బడిచచ్చెడు- చీమను ఒడ్డున వేయుచు
తల్లిని విడి వ్యథనొందెడి- లేగనావు కడ జేర్చుచు

నీరజములు నడచినట్లు- నీడలు కదలాడినటులు
సాగెనతడు అతనితోడ సాగెను యోచనలు

గాలి కదల గాలిలోని నీరమేదొ గమనించును
నీరు కదల నీటిలోని-గాలియేదొ పసికట్టును
పూలలోన పరమాత్ముడు పవ్వళించు తీరుకనును
భ్రమరనాదములను దాగు-
ప్రణవ నాదములను వినుము

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087