Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్షి కదల పక్షిలోని పరమాత్ముని దర్శించును
దర్శించెడి కనులదాగు దర్శకుణ్ణి స్పర్శించును

వేదమ్మే నాదమ్మై- అతని చెవిని మ్రోగెను
నైరూప్యమై రూపమ్మై ఆతని నలరించెను.

ఏమి సృష్టి! ఏమి సృష్టి సృష్టి సేయ పరమాత్ముడె!
ఏమి రచన! ఏమి రచన! రచయితయన పరమాప్తుడె!

కరముతోడ కదలించెనొ? చరణమ్మున తాకెనొ?
కనుల తోడ పరికించెనొ? కావ్యమాయె సృష్టి!

అనుచు, వినుచు, పరికించుచు
కావ్యమ్మున వాక్యమట్లు
వాక్యమ్మున పదములట్లు- కదలెనతని పదములు

పక్షులవలె నక్షమ్ములు కదలించగ కనురెప్పల
క్రౌంచపక్షి మిథునమ్మును కాంచెనంత వౌని

ముక్కున ముక్కును జేర్చుచు-
రెక్కవిప్పి తిరుగాడుచు
అక్కునందు అక్కుజేర్చి- రిక్కలవలె కదలాడుచు

ఒకే కొమ్మపైని జేరి ఒకే రెమ్మ మీటుచు
ఒకే పండు కొరికి తినుచు- ఒకే పాట పాడుచు

ఒకే ప్రాణమొకే దేహమొకటే మనమనుచు
ఒకటే పరమార్థమనుచు బాసలెన్నొ చేయుచు

చీకటి వెలుగులనుబోలు పక్షి జంట జూచెను
చీకటులను వెలుగులవలె అతని కనులు వెలిగెను
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087