మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరికొందరికి ఆ పరంజ్యోతి యొక్క సంపూర్ణ సాక్షాత్కారము లభించిననే కాని పారవశ్యము గలుగదు. కాని ఇతరుతెఱగులవారును బ్రహ్మానందపరవశులై సమానముగనే ధన్యులగుచున్నారు.
657. భగవంతుడు పంచదారకొండ వంటివాడు. చిన్న చీమ వెడలి యొక చిన్న నలుసును దెచ్చుకొనును, పెద్ద కొండచీమ యొక పలుకును దెచ్చుకొనును. కాని కొండ యెప్పటివలెనే యుండును, తఱుగదు. భగవద్భక్తుల విషయము కూడా నిట్టిదే. భగవంతుని యనంత కల్యాణ గుణములలో - విభూతులలో - ఒక్కదానిచేతనే వారు బ్రహ్మానంద పరవశులగుదురు. వానినన్నిటిని సాక్షాత్కరించుకోగల్గినవారు ఎవ్వరును లేరు.
658. బ్రహ్మానంద సాగరమునుండి వెలువడు నానంద వీచికలు ఎవ్వని హృదయమును సోకినను దానిని పరివర్తన యొందించును. సనక సనందనాది మునివరులీ వీచికలచే ముగ్ధులైరి, భగవద్భక్తి పరవశుడగు నారదుడు నిజముగా దూరమునుండి యా బ్రహ్మసాగరమును గాంచెను,
కాని వివశుడై సదా భగవన్నామ సంకీర్తన మొనర్చును. ఉన్మత్తుడై త్రిలోకములందును దిరుగాడుచున్నాడు. ఆజన్మ యోగి వరిష్టుడగు శుకదేవుడు ఆ బ్రహ్మసాగరమున కేవలము తన హస్తముతో ముమ్మారు తాకెను. నాటినుండియు బ్రహ్మానంద పరవశుడై పసిపాపవలె దొరకలాడుచున్నాడు. జగదీశ్వరుడగు మహాదేవుడు అందలి మూడుపుడిసెండ్లజలము త్రావి బ్రహ్మానంద పారవశ్యమున శవమువలె అచలుడై పడియున్నాడు. ఈ బ్రహ్మసాగరమయొక్క లోతును- అగోచరమగు దాని ప్రభావమును ఎవరు గ్రహింపగలరు?
659.కేశవచంద్రసేనునితో శ్రీ గురుదేవుడిట్లు పలికెను: ‘‘మీ బ్రాహ్మసమాజమువారు భగవంతుని చెయిదములను గూర్చియు, తద్వైభవమును గూర్చియు అంతగా స్తోత్రము చేయుచుందురేల? ‘ఓ దేవా! నీవు సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించినావు’ అనుచు, అదియే మహావిశేషమని భావించుచుందురేల? పూలతోట యొక్క సొగసును, అందలి దివ్యమైన పూవులను, వాని పరిమళమును గాంచి ముగ్ధులగువారే కాని తోటయొక్క అధిపతిని కనుగొనువారెవ్వరు? తోటయా ఘనమైనది? దాని యధిపతియా, ఘనుడు? సదా మృత్యువు మన నడుమ విహరించుచుండ ప్రపంచమను నీ వనము కేవలము బూటకమనియు దీని కధిపతియగు భగవానుడొక్కడే సత్యమనియు గ్రహింతముగాక!
‘‘సారా దుకాణమన నొకటి రెండుపాత్రలను గైకొనిన పిమ్మట లోపల ఎన్ని సీసాల సారాయమున్నదో ఎవరికి గావలయును? మైమరచుటకు ఒక్క సీసా చాలదా?
‘‘నరేంద్రుని జూచినంతనే పట్టరానియానందమున మైమరతును. ‘మీ నాయన యెవరు?’ అనిగాని, ‘మీకెన్ని యిండ్లు, వాకిండ్లు కలవు?’ అని గాని నేనెన్నడును అతని నడుగలేదు.
‘‘నరులు తమ సిరిసంపదలను ఎంతయో గొప్పగా గణన చేయుదురు. కాంచనము, వస్తు వాహనములు- ఇవియే వారి దృష్టిలో గణనీయములు. తమవలెనే భగవంతుడును సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మొదలగు తన సృష్టి జాతము ఎంతయో విశేషముగా నెంచునని వారి అభిప్రాయము! భగవంతుని చెయిదములను నుతించినయెడల అతడు సంతసించునని వారి భావము!’’
660. పసిబిడ్డ యొక్క అమాయకత్వము ఎంత మనోహరము! లోకమందలి సిరిసంపదలన్నింటికంటెను ఒక్క బొమ్మయనిన ఎంత సంతసించును! ఎంత మక్కువ జూపును! శ్రద్ధావంతుడగు భక్తుడు నిట్టివాడే, పేరు ప్రతిష్ఠలను సిరిసంపదలను ఈసడించి దేవునితోడిదే లోకమని కూర్చుండువారు మరెవ్వరు?
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి