Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు వేదాలె నాల్గుపాదాలై పోయినట్లు
సుశ్లోకవ్మౌ శారద సుశ్లోకమ్మైనయట్లు

అది శోకమొ! అది శ్లోకమొ! అది కోపమొ! తాపమొ!
అదరెడు పెదవుల వెంబడి పదములటుల దొరలెను

మనసే మంత్రమ్మాయెనొ! మాటయె మనసాయెనో?
కనుల వెంట అశ్రువులే పొరలి పొరలి దొరలెను

చేరెనాశ్రయమ్ము కాని కానలోనె మనసు
కూర్చుండెను వేదికపై- కూర్చుండునె మనసు?

అతని పలుకు లాతనికే అబ్బురమ్ముగా తోచెను
అతని ఉలుకులాతనికే- ఆవేదన రగిలించెను

‘‘ఇది ఏమిటి?
మంత్రవౌచు మాటలెట్లు ప్రవహించెను?
ఏమి దీని చందమ్ము? ఏమి దీని ఛందమ్ము?’’

శోకమెట్లు శ్లోకమాయె? కోపమెట్లు శాపమాయె?
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం తానెట్టుల సంధించెను?

కుక్షి కొరకు పక్షి వేట- పక్షి కుక్షి జేరును
పక్షి చావకున్న జచ్చు- కుక్షినున్న పక్షి

ఎవడోరుూ చంపువాడు? ఎవడు చంపబడును?
చచ్చెడునది ఏమిటోయి? చచ్చునెటుల నాత్మ?

చచ్చునపుడె కాయమ్ము- కర్మమ్మును చచ్చును
కర్మము తొలగిన వేళల- ముక్తి జీవునకును
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087