Others
ఒక విషాద వాక్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గుబురు గుబురుగా అల్లుకున్న మనుషుల మధ్య
చెమట పూలు తెల్లగా విచ్చుకున్నాయ
ప్రయాణం అనాథవ్వకూడదు
అదొక సామూహిక జీవమున్న చలనమవ్వాలి
కోటీలో సోహెల్ భవిష్యత్తు మెత్తగా నవ్వుతోంది
చాదర్‌ఘాట్ ఒంపులో గప్పుమన్న స్వచ్ఛ్భారత్
మలక్‌పేట ఇరుకుల్లో చక్రాల సంశయం
దిల్‌కుష్‌నగర్‌లో ఆందోళన
నక్కినక్కి చూస్తోంది
ఆటో నవాజ్ కళ్లలో ఆర్థిక అభద్రత
పడగ విప్పిన పాములా కదులుతోంది
భూమిపై తప్పిపోయన ఎర్రటి పుష్పం
నల్లని రాయ వెనుక
ముడుచుకుపోవడానికి సిద్ధంగా
అక్షరాలు అక్షరాలు ఎటుచూసినా అక్షరాలే
ఫుట్‌బోర్డుపై అక్షరం ఆరిపోతున్న వాసన
అక్షరాల చూపుల్లో తుళ్లిపాట్లు, తడబాట్లు
అక్షరాలకు కాన్ఫిడెన్స్ గీతను గీసేశాను
కిటికీ తెరవగానే
గాలితో ఆకుల సంభాషణ తడితడిగా
కన్నులు అటు జరగగానే
ఒక విషాద వాక్యంలా కబళిస్తున్న కాలుష్యం
రాత్రిని కప్పుకున్న పిట్టల రెక్కలు
మసకబారిన నక్షత్రాలు
ఆకాశంలో కవాతు చేస్తున్నాయ
అదిగో అటువైపు నది కదిలింది
నదితో పాటు మీరు నేను పిట్టలు