Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను కాలిపోవునటుల నే బొదిగ మారునటుల
నా పాపం మాయునటుల శపియించుడి నన్ను’’

అని చేతుల జోడించెను
అశ్రువులను నించెను

‘‘విలపించకుమో రాజా! విలపించుకుమోరుూ!
విధి రాతను తప్పించగ ఏ విధి సాధ్యమ్ము?

శాపమాయె నా బ్రతుకే- శాపమిత్తు నెటుల?
బ్రహ్మ పాతకమ్ము లేదు- బాపడనే గాను

కాని యొక్కటే మిక్కిలి కలవరపరచును నన్ను
శరఘాతము కన్న మిన్న బాధించును నన్ను

వృద్ధులు నా తలిదండ్రులు- కడు బీదలు వీరలు
కనగా కన్నులును లేవు- కన్నకొడుకు లేడిక

కదల లేరు, మెదల లేరు- బ్రతుకులీడ్వ లేరు
తెగిన తీగలట్లు వారు- నీ కాళ్ళను పడెదరు

వారే నీకింక దిక్కు- శిక్షించను బ్రోవను
నీవే వారికి దిక్కిక- నీకు క్షేమవౌనిక’’!

అనుచునతడు ఇరుచేతుల జోడించుచు వేడెను
‘‘అటులె’’యనుచు దశరథుండు
అతనికభయమిచ్చెను

కరిగి కనులు కెరటమ్ముల కడిగెనంత శ్రవణుని
పాత్రలోని నీరమొలికె- ప్రాణమ్ములు నొలికె
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087