AADIVAVRAM - Others

స్పష్టత ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏయే రకాల రోడ్లని ఏయే పేర్లు పెట్టి పిలవాలనే అంశం మీద ఆ మధ్య తెలుగు వికీపీడియాలో ఒక చర్చ జరిగింది. రాసేటప్పుడు స్పష్టత ఉండాలని పాటు పడేటప్పుడు ఇటువంటి సుదీర్ఘమైన చర్చ అవసరం.
మనకి మట్టి రోడ్లు ఉన్నాయి. కంకర రోడ్లు ఉన్నాయి. తారు రోడ్లు ఉన్నాయి. సిమెంటు రోడ్లు ఉన్నాయి. ఇవి రోడ్డు నిర్మాణానికి వాడే పద్ధతులని అనుసరించి పెట్టే పేర్లు. ఈ పేర్లు ఎవరికి తోచినట్లు వాళ్లు పెట్టేసుకుని వాడెయ్యడమేనా లేక వీటిలో ఒక వరస, వావి ఉన్నాయా?
రోడ్డుని ఏ పేరు పెట్టి పిలవాలి అన్న ప్రశ్న పుట్టినప్పుడు సందర్భ శుద్ధి ఉండాలి అంటాను. రోడ్లకి పేర్లు పెట్టేటప్పుడు వాటిని నిర్మించడానికి వాడిన పదార్థాలని అనుసరించి పేర్లు పెట్టడం ఒక పద్ధతి. మట్టి (జూజూఆ) రోడ్డు, గులక (ఔళఇఇళ), రోడ్డు, కంకర (్ఘ్పళ), రోఢ్డు, తారు (్ఘఒఔ్ద్ఘఆ), రోడ్డు, సిమెంట్ (షళౄళశఆ) రోడ్డు వగైరా. కంకర అనే తెలుగు మాటకి ఘూ్పళ, ఖఇఇళ, ౄళఆ్ఘ అనేవి సమానార్థకాలు. గులకరాయి అంటే ఔళఇఇళ. మరొక విధంగా చెబుతాను. పెద్ద రాళ్లని సుత్తితో కొట్టి చిన్నచిన్న ముక్కలుగా కొట్టినప్పుడు మనకి కంకర వస్తుంది. పెద్ద రాళ్లు నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చి నున్నగా అయిన చిన్నరాళ్లని గులక అంటారు.
కేవలం మట్టిరోడ్డు కాలక్రమేణా గట్టిపడి రూపాంతరం చెందినప్పుడు దానిని గులక రోడ్డు అంటారు (గులక వాడినా వాడకపోయినా), తదుపరి ఆ రోడ్డు మీద కాసింత ఎర్రమట్టి వేసి చదును చేస్తే అది రబ్బీసు లేదా కచ్చా రోడ్డుగా తయారయ్యి, కొన్నాళ్లు దానిని ప్రజలు వాడిన పిదప, గట్టి పడిన తదుపరి, దానికి మరి కొంత గట్టిదనం తెచ్చేందుకు మరొక మారు నీరు, కంకరతో కూడిన ‘గ్రావెల్’ రోడ్డు వేస్తారు. (దీనినే ఇంజనీరింగు పరిభాషలో ‘మెకేడం’ లేదా ‘వాటర్ బౌండ్ మెకేడం’ అని కూడా అంటారు) దీనినే మనం రోజువారీ వాడకంలో పక్కారోడ్డు అని కూడా అంటారు. ఇటువంటి రోడ్డు వాడుకలోకి వచ్చిన కొద్ది రోజులలో తారు రోడ్డు వేసేందుకు అనువుగా ఉంటుంది. లేదా, తారు రోడ్డు వేసేందుకు ముందుగా ఇటువంటి రోడ్డును తయారుచేస్తారు.
రోడ్లని మరొక దిశలో కూడా వర్గీకరించి పేర్లు పెట్టవచ్చు. మనకి సందులు ఉన్నాయి, గొందులు ఉన్నాయి. గల్లీలు ఉన్నాయి. వీధులు ఉన్నాయి. రహదారులు ఉన్నాయి. ఇవి రోడ్డు వెడల్పుని అనుసరించి పెట్టే పేర్లు. ఇంగ్లీషులో అయితే రోడ్డు వెడల్పుని బట్టి య్ఘూజూ, ఒఆళళఆ, ఘశళ, జూజ్పళ, ఘ్పళశఖళ, ఇ్యఖళ్ప్ఘూజూ అనే పేర్లు వాడుకలో ఉన్నాయి. అమెరికాలో ఎవెన్యూ అంటే ‘రోడ్డుకి ఇరువైపులా అందమైన చెట్లుఉండి, తిన్నగా, నిటారుగా ఉండే రోడ్డు’ అని అర్థం. బులవార్డ్ అనేది ఎవెన్యూ కంటే వెడల్పుగా ఉండి, ఇటు అటు వెళ్లే వాహనాల్ని విడదీస్తూ, రోడ్డు మధ్యలో, నిలువుగా పచ్చిక చీలిక, ఇటు అటు కాలిబాటలు ఉండే విశాలమైన వీధి.
ఇంగ్లీష్‌లో ‘రోడ్’ (్య్ఘజూ) అన్న మాటకి ‘స్ట్రీట్’ (ఒఆళళఆ) అన్న మాటకి మధ్య అర్థంలో తేడా ఉంది. ‘రోడ్’ అనేది ఒక ఊరు నుండి మరొక ఊరుకి తీసుకెళ్లే మార్గం. ‘స్ట్రీట్’ అంటే ఊళ్లో ఉండే వీధులు. ఉదాహరణకి బందరు రోడ్డు అనేది విజయవాడ నుండి బందరు వెళ్లే రహదారి. ‘మీరు ఏ వీధిలో ఉంటారు?’ అని అడగదలచుకుంటే ‘్జశ త్ద్ఘీఆ య్ఘూజూ జ్యూ క్యఖ జ్పళ?’ అనకూడదు. ‘్జశ త్ద్ఘీఆ ఒఆళళఆ జ్యూ క్యఖ జ్పళ?’ అనాలి. మరొక విధంగా చెప్పాలంటే పట్టణాల లోపల ఉండే వాటిని ‘స్ట్రీట్’ అనిన్నీ బయట ఉండే వాటిని రోడ్లు అనిన్నీ అనొచ్చు.
మా ఊళ్లో పూర్వం మా ఇల్లు బత్తాయితోట ‘వీధి’లో ఉండేది. మా ఇంటికి రావాలంటే ఆంజనేయ స్వామి దేవాలయం నుండి సూరవరం ‘రోడ్డు’ మీద మైలు దూరం నడచి రావాలి.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా