Others

అల్లూరి సీతారామరాజు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ 100వ చిత్రంగా తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సినిమా స్కోప్‌గా 1974న విడుదలైన సినిమా -అల్లూరి సీతారామరాజు. ఈ చిత్రంలో ఎన్నో సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు వి రామచంద్రరావు. అల్లూరి పాత్రలో ‘కృష్ణ’ అందరి అభిమానాన్ని చూరగొన్నారు.
దేశంకోసం ప్రాణాలర్పించిన మహానుభావులలో అల్లూరి సీతారామరాజు ఒకరు. చిన్ననాడే తెల్లదొరల దురహంకారాన్ని ఎదిరించి, బానిస బుద్ధులు నేర్పే పరాయి చదువుల్ని తిరస్కరించాడు. స్వయంకృషితో, సంస్కృతాంధ్ర, ఆంగ్ల, హిందీ భాషలలో అనర్గళమైన పాండిత్యం సంపాదించాడు. మన్య ప్రజల్ని సమీకరించి, వారి బ్రతుకుల్ని సంస్కరించి తరతరాల దాస్యంనుంచి విముక్తుల్నిచేశాడు. ఆ బడుగు ప్రజల్లో చల్లారిపోయిన శౌర్యదీపాన్ని వెలిగించి విప్లవ శంఖం పూరించాడు. ఆ విప్లవ శంఖం దుష్టపాలకుల గుండెల్లో తుఫాను రేకెత్తించింది. ఆ శౌర్యఘోష బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదుల్ని పెకలించింది. మంచికి మార్గదర్శకుడిగా, పౌరుషానికి పట్టుకొమ్మగా, పేదల పెన్నిధిగా, సత్యధర్మాలకు సంకేతంగా, విప్లవానికి ప్రతీకగా నిలిచిన మహాపురుషుని జీవితగాధే అల్లూరి సీతారామరాజు చిత్రం.
గంటం దొరగా గుమ్మడి, మల్లు దొరగా ప్రభాకరరెడ్డి, అగ్గిరాజుగా బాలయ్య, పడాలుగా కాంతారావు, వీరయ్యదొరగా రావు గోపాలరావు, రూథర్‌ఫర్డ్‌గా జగ్గయ్య, పిళ్లైగా కె.వి.చలం, బ్రౌకన్‌గా పేకేటి శివరాం, బాస్టియన్‌గా త్యాగరాజు, సీతగా విజయనిర్మల వారి వారి పాత్రలలో నటించి తమ నటనాకౌశలాన్ని ప్రదర్శించారు.
మహారథి మాటలు చిత్రానికి ఆయువుపట్టు. ఆదినారాయణరావు సంగీతం, వి.యస్.ఆర్.స్వామి ఫొటోగ్రఫీ గురించి చెప్పడం కంటే సినిమా చూస్తేనే వారి ప్రతిభ మనకు అర్థమవుతుంది. మన కవులు ఒక్కొక్కరు తమతమ బాణీలో ఒక్కొక్క ఆణిముత్యం లాంటి పాటలు.. రగిలింది విప్లవాగ్ని (ఆరుద్ర), వస్తాడు నారాజు ఈరోజు (సినారె), కొండదేవతా నిన్ను కొలిచేనమ్మా (కొసరాజు), తెలుగువీర లేవరా (శ్రీశ్రీ) తదితర పాటలు వ్రాసి ప్రేక్షకుల్ని పరవశింపజేశారు. సీతారామరాజు కథను చిత్రంగా రూపొందించిన చిత్ర సమర్పకులు ‘కృష్ణ’ ఎప్పటికీ అభినందనీయులు. ఇంతమంది మహనీయుల కృషి ఫలితంగానే 43 ఏళ్లు పూర్తిచేసుకుంటున్నా ఇంకా ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది.

-తెర్లి రమణారావు, కాకినాడ