Others

మాతృదేవోభవ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ గురించి ఎంత చెప్పినా
ఎంత చేసినా తక్కువే
అమ్మ కంటికి మనం
చాలా అందంగా కనిపిస్తాం
అమ్మ తన బిడ్డల కోసం నిత్యం పోరాడుతూ
శ్రమిస్తూనే ఉంటుంది

ఈ ప్రపంచంలో పేదవాడు ఎవడు అంటే-
అమ్మ లేనివాడు అసలైన పేదవాడు
ఎంత ధనం ఉన్నా కొనలేనిది
అమ్మప్రేమ ఒక్కటే
అమ్మ ప్రేమను పొందినవాడే
నిజమైన ధనవంతుడు

అమ్మను మించిన దైవమున్నదా?
ఆత్మను మించి అద్దమున్నదా?
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే!
అంటాడు ఒక సినీకవి

ఆప్యాయంగా మనం అమ్మ కళ్ళలోకి
చూస్తే మన బాధలు మర్చిపోతాము
అమ్మతో మాట్లాడితే
ఉల్లాసంగా గడుపుతాము
మనకు ఏ బాధ కలిగినా ముందుగా
తలచుకునేది అమ్మనే!

మాతృమూర్తుల సేవలను గుర్తు చేసుకొనేందుకు
ఒక రోజంటూ ఏర్పడటం నిజంగా హర్షణీయం
కానీ- అమ్మ ప్రేమ ఒక్క రోజుకే
పరిమితం కాదు.. అది వెల కట్టలేనిది.

ఈ లోకానికి మనల్ని పరిచయం చేసిన
అమ్మను ప్రేమిద్దాం!
ఆమె సేవలకు గుర్తింపునిద్దాం
కష్టం రానివ్వమని అమ్మకు మాటిద్దాం!

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ,
అతిథి దేవోభవ.. అని పెద్దలు చెప్పినా-
అమ్మకే అగ్రస్థానం

-జె.అజయకుమార్, హైదరాబాద్