Others

జ్ఞాన వాకిలి ధ్యానమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీచక్రము, మానవ శరీరం
*
ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
*
ఇటీవలి కాలంలో కొంత మంది సాధకులు చేసిన ప్రార్థనలను పరిశీలిద్దాం. శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతిముని (నాయనగా ప్రసిద్ధులు) శ్రీ మహాగణపతినిట్లు ప్రార్థించారు.
శ్లో॥ హస్తిముఖ యాచే గాఢరసభక్త్యా
ఆ విశ విభో మాం దివ్య నిజశక్త్యా
ఓ గజవదనా! నిన్ను గాఢ భక్తితో ప్రార్థిస్తున్నాను నీ దివ్య శక్తితో నన్నావహంచు ప్రభు!
శ్లో॥ ఉద్గతకీలం మూలమిదం భిన్నకపాలం శీర్షమిదం
ఉద్ధత మోహంచిత్తమిదం వాసవశక్తిః ర్మాంవిశతు
భావం: మూలాధార చక్రమందు అగ్నిలేస్తున్నది. శిరస్సున కపాల భేదనమైనది చిత్తము నమోహమణగినది, జగన్మాతయైన ఇంద్రాణి నాలో ప్రవేశించుగాక.
మహాయోగ్యులైన రమణమహర్షి, అరవిందుడు మొదలైన వారెందరో దివ్య శక్త్యావేశమున చేసిన ప్రయత్నములు, ప్రార్థనలు ఇట్టివే. వాల్మీకి మహర్షి నోటినుండి చందోబద్ధమైన వాక్కులు శ్లోక రూపమున మొదటగా వెలువడినపుడు బ్రహ్మ, సరస్వతి అతని వాక్కున ప్రవేశించునట్లు చేయుటవలన శ్లోక రూపములో ఛందోబద్ధమైన వాక్కులు వెలువడినట్లు చెప్పారు.
భారతీయ యోగ మరియు ధ్యానంలోని పరిజ్ఞానం ఇరవై వేల సంవత్సరాలకు పైగా పరిరక్షించుకొనబడింది. ఈ పరిణితిలో యెందరో మహానుభావులు, యోగులు దీని ఫలితాల్ని చాలా స్పష్టంగా పొంది ప్రదర్శించారు. వారు అసంఖ్యాకులైనప్పటికి కొద్దిమందిని స్మరించుకుందాం. ముఖ్యంగా శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి (1560-1750) సిద్ధపురుషులు తమ యిచ్చ వచ్చినంతకాలం బ్రతికి స్వచ్ఛందంగా దేహత్యాగం చేశారు. త్రైలింగస్వామి 280 సం.లు జీవించి సిద్ధిపొందారు. సొరకాయల స్వామి 202 ఏండ్లు బ్రతికినారు. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి 190 ఏండ్లు జీవించి సజీవసమాధి పొందారు. వీరు సదా బ్రహ్మనిష్టులై యుండెడివారు.
1. సదాశివ బ్రహ్మేంద్రులొకసారి గ్రామాల పొలిమేరల్లో తిరుగుతూ పొలంగట్టుపై తలపెట్టి నిద్రిస్తుంటే ఆ పొలం యజమాని గమనించి ‘‘సర్వసంగ పరిత్యాగియైన సన్యాసికి కూడా తలగడ కావలసి వచ్చిందే’’ అన్నాడట. అది విన్న స్వామి తన యోగ శక్తి ప్రదర్శించే వుద్దేశంతో అక్కడే గాలిలో తేలుతూ నిదురించారట. ఆ దృశ్యం చూసిన పొలం యజమాని ‘‘ఒక్కొక్కడు యోగియైనా అహంకారం పోదుగదా’’ అన్నాడట. ఆ మాటలు విన్న సదాశివ బ్రహ్మేంద్రులు సాక్షాత్తు భగవంతుడే ఆ పొలం యజమాని రూపంలో వచ్చి తన అహంకారం తొలగించి అనుగ్రహించాడని గ్రహించి కృతజ్ఞతలు తెలిపారట.
2. సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి, వొకసారి కావేరీ నది వొడ్డున ‘‘కోడుమూడి’’ అను ప్రదేశములో సమాధి (్ధ్యన) స్థితిలో వున్నారు. అప్పుడు కావేరీ నది వరదలతో వుప్పొంగింది. అప్పడు స్వామి వరదలో మునిగి ఇసుకలో పూడుకపోయిరి. మూడు మాసముల తరువాత రైతుల ఇసుక మేటలు తవ్వుతుండగా అందులో నుండి స్వామివారు బయటపడి ఏమీ జరగనట్లు వెళ్ళిపోయినారట.
3. జీవన్ముక్తులైన అవధూత స్థితిలో సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి వారొకసారి తిరుచిరాపల్లిలో నవాబు గుడారంలో ప్రవేశించి ఘోషాస్ర్తిలు వుండేవైపు పోతుంటే కోపోద్రిక్తుడైన నవాబు కత్తితో స్వామివారి భుజం నరికివేశాడు. భుజం తెగి వ్రేలాడుతోంది. రక్తం ధారలుగా చిమ్ముతున్నా నిర్బాధగా ఏమీ పట్టనట్లు స్వామి వెనుదిరిగి పోతూంటే, ఆయనెవరో మహాపురుషుడై వుంటాడని తలచి నవాబు స్వామివారి పాదాలపై బడి క్షమాభిక్ష వేడుకోసాగారు. అతని ప్రార్థన విన్న స్వామి స్పృహలోకి వచ్చి భుజం తడుముకున్నారు. భుజం యెప్పటివలె అతుక్కుపోయింది. నవాబును క్షమించి స్వామి సాగిపోయినారట.
4. తంజావూరు మహారాజు శంభోజీ (1711-1729) ఆస్థాన విద్వాంసుడు గురువైన మలహరి పండితుడు ‘‘సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని ‘‘దీపాంబాపురం’’ పొలిమేరలో దర్శించి తన ప్రభువుకు సంతానబిక్ష యాచించాడు. స్వామివారనుగ్రహించి తాము రచించిన ‘‘ఆత్మ విద్యావిలాసమను గ్రంథమును’’ ప్రసాదంగా యిచ్చారు. మలహరిపండితుడు స్వామివారికి మూడు బిక్షలు (్భజనము) సమర్పించి ధన్యుడైనాడు.
5. సదాశివ బ్రహ్మేంద్రస్వామి పుదుక్కోట సంస్థాన ప్రాంత అడవులలో గ్రామాల్లో ఎక్కువగా సంచరించేవారు. విజయ రఘునాథ తొండమాన్ రాజు (1730-1769) స్వామిని దర్శించి తనకు సత్సంతానంకొరకు తన రాజ్యం సుభిక్షంగా వుండాలని, తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించాడు. 8 ఏండ్లు స్వామిని విడువక సేవించాడు. అతని భక్తిశ్రద్ధలకు మెచ్చి స్వామి ఆయనున శిష్యుడిగా అంగీకరించి ‘‘దక్షిణామూర్తి మంత్రం ఇసుకపై వ్రాసి (1738) ఉపదేశించినారు. రాజు ఆ యిసుకనట్లే ఎత్తించి బంగారు పేటికలో నుంచి భద్రముగా తన పూజాగృహంలో పెట్టుకున్నారు. పుదుక్కోట రాజభవనంలో అది యిప్పటికి వుంది. స్వామివారు అఖండ కావేరీ పీఠాన ‘‘నెరూరు’’లో శేష జీవితం గడుప నిశ్చయించి, తమ దేహత్యాగ సమయాన్ని, సమాధి ప్రవేశం చేసే స్థలాన్ని విజయ రఘునాద తొండమాన్ రాజుకు తెలియచేసి, తాను సమాధి ప్రవేశం చేసిన తొమ్మిది రోజుల తరువాత తమ సమాధిపై బిల్వ (మారేడు) వృక్షం మొలకెత్తునని, 12వ నాడు కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు శివలింగం తెస్తాడని దానిని తన సమాధికి తూర్పున 12 అడుగుల దూరంలో ప్రతిష్టించి గుడి కట్టమని చెప్పారు. స్వామివారు వైశాఖ శుద్ధ దశమినాడు సమాధి ప్రవేశం చేసి, సజీవ సమాధియైనారు. స్వామి ఏక కాలంలో ‘‘నెరూరు’’లోను ‘‘మనమదురై’’లోను ‘‘కాశీ’’లోను సమాధి చెందుతుండగా వేల కొలది భక్తులు దర్శించినట్లు చెబుతారు. స్వామి స్థూల శరీరం ‘‘నెరూరులోను, సూక్ష్మ శరీరం ‘‘కాశీ’’లోను, కారణ శరీరం’’ మనమధురైలోను భక్తులు దర్శించినట్లు పండితాభిప్రాయం. నెరూరులోని కావేరీ తీరమందలి స్వామివారి సమాధిని, శివాలయాన్నీ, మారేడు వృక్షాన్ని దర్శించే భాగ్యం ఈ గ్రంథకర్తకు కలిగింది.
**
- ఇంకాఉంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014