Others

కనువిందు కెరటాల...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనువిందు కెరటాల మునుముందు కురికే
అందాల కృష్ణమ్మ ఎందాక పయనం?

నీ సార తీరాల భూగర్భఖనులుగా
ఏ శిల్ప ఖండాలు గొప్పవై కప్పబడి
ఎక్కడైనా వున్న చక్కగా చెప్పవే
ఎప్పటెప్పటి చరిత కవితగా పాడవే కనువిందు

ఏ గంధ వృక్షాల సౌగంధికములందు
ఏ అడవి పుడమిని ఎంతగా తిరిగావొ

ఏ పూల తరుముకుని నగలుగా వేసుకుని
ఎంత గర్వించితో వింత పోకడలతో కనువిందు
ఈ తీర జనులలో అందాల యువతులకు
నీ తీరు నేర్పావొ నడకలే సొబగులు
వయ్యారి సయ్యాట లయ్యారె నీ యవి
వర్ణించగలడొకొ వసుధపై ఏ కవి!

గంగమ్మ కాకిగా మునుగంగ నీలో
పొంగింది కద తాను హంసగా మారగా
హంసల్లదీవికడ కడలి కౌగిలి చేర
ఆ దుర్గ ఆశీస్సునంది పరుగిడినావొ కనువిందు

- సన్నిధానం నరసింహశర్మ, 9292055531