Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక కర్పూర కళికలా వెలిగిపోతూ, అనంత విశ్వంలో సురభిళాల్ని వెదజల్లుతున్నాడు! పరిమళ ద్రవ్యంగా మారిపోతున్నాడు! ఒక ధవళ మహామేఘంలా కదుల్తూ, కాంతిని వర్షిస్తున్నాడు!... ఎక్కడికో ఏ అనంత దూరతీరాలకో, తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే కదిలిపోతున్నాడు. తాను నిల్చున్న పర్వతంతోసహా పర్వత శిఖరంతో సహా! ఏ మహత్తర విశ్వశక్తి తనని ఆవహించిందో తెలీదు! తనతో ఈ పనిని గావింపజేస్తోందో తెలీదు!... ఎంతటి అద్భుతం?... కళ్ళు తెరిచినా అద్భుతమే!... కళ్ళుమూసినా అద్భుతమే!... అసలు తానే ఒక అద్భుత సృష్టి!...
తల పైకెత్తి చూశాడు!... ఒక అనంత కాంతి ప్రవాహం తన తలపై క్రుమ్మరించబడుతోంది!... ఆకాశ గంగలా వర్షిస్తోంది! ఆ వెల్లువలో తనని ముంచెత్తుతోంది! తననొక శివంకర మూర్తిని, శివున్ని గావింపజేస్తోంది!... తనతో ఒక తాండవ నృత్యాన్ని చేయిస్తోంది!...
ఎంతటి విచిత్రం!... ఏంచేయాలి తాను?... ఏం చేయగలడు తాను?... సమాధానం దొరకడం లేదు, ఆలోచన కుదరడం లేదు.
తపస్సు చాలించి, ఆ కొండపై విశ్రమించాడు. ఉదయాద్రిపై తన తల నుంచి, ఆ తలక్రింద తన వామహస్తాన్ని చేర్చి, అర్థనిమీలిత నేత్రుడై, తన నిడుపాటి కాళ్ళని పశ్చిమాచలం దాకా చాచాడు. ఆలోచనలో మునిగాడు. ఆపై ఓసారి తనవంక తానుచూసుకొన్నాడు!
... ఎంతటి విచిత్రం!... ఒక శేషశాయిలా, విష్ణుమూర్తిలా ఉన్నాడు తాను!... ధవళకాంతుల సాగర కెరటాల మధ్య!... తన వక్షస్థలం మీద కొలువున్న మహాప్రకాశం లక్ష్మీదేవిలా మందహాసం చేస్తోంటే, భూదేవి తన సుకుమార కరకమలాలతో తన కాళ్లొత్తుతూ కూర్చుంది! తన కిరణాల తామర తూడుల చివరన విప్పారిన పద్మంలాంటి ప్రకాశ వికసనంలోంచి తన ధవళ చంద్రికలతో నునులేత నవ్వుల్ని చిందిస్తున్నాడు సుతారంగా చంద్రుడు, ఒక బాలబ్రహ్మలా!... ఎంత విచిత్రం?... ఎంతటి అద్భుతం?... తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087