Others

చెలి - కడలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెలికి మరో రూపం కడలి
గాంభీర్యతలోనూ.. ఆత్మీయతలోనూ..

చూచిన తోడనే ఉరుకున వస్తుంది అల
చాచిన చేతులు కౌగిలిగా బిగియక మునుపే
తాకి, వదిలిపోతుంది మెరుపులా
మెలకువ సోకిన వేకువ కలలా...
చెలికి మరో రూపం కడలి
సంఘర్షణలోనూ... ఆకర్షణలోనూ...

సుడులెన్ని ఉన్నా సడి చెయ్యదు
సునామీలున్నా ఖాతరు చెయ్యదు
ప్రశాంతత పరదా కప్పుకొని
నీ చుట్టూ నిశ్శబ్ద సంగీతాన్ని నింపిపోతుంది

- డా. డి.వి.జి. శంకరరావు, 9440836931