Others

ప్రధానికే లంచం..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూజిలాండ్ ప్రధానికే లంచం పంపిందో పదకొండేళ్ల చిట్టితల్లి.. ఎంత లంచం ఇచ్చిందో తెలుసా.. ఐదు న్యూజిలాండ్ డాలర్లు.. ఇంతకీ ఎందుకు లంచం ఇవ్వాల్సి వచ్చింది? అనే కదూ మీ ప్రశ్న.. అయితే చదవండి.. న్యూజిలాండ్‌లో వికోర్టియా అనే పదకొండు సంవత్సరాల బాలిక డ్రాగన్లపై ఇష్టం పెంచుకుంది. వాటికి ఎలాగైనా శిక్షకురాలిగా మారాలని భావించింది. కానీ అవి ఎక్కడుంటాయో ఆ పాపకు తెలియలేదు. చాలామందిని అడిగింది. అందరి దగ్గర నుంచి తెలియదనే సమాధానమే వచ్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటి గురించి తెలుసుకునేందుకు పరిశోధనలు చేయాలనుకుంది. ప్రభుత్వాన్ని కూడా డ్రాగన్లపై పరిశోధనలు చేయాల్సిందిగా కోరింది. ఇందుకోసం ఆ దేశ ప్రధాని అయిన జెసిండా ఆర్డెన్‌కు ఓ లేఖ కూడా రాసింది. జెసిండా దీనికి ఒప్పుకోవడానికిగాను ఐదు డాలర్లను లంచంగా ఓ కవరులో పెట్టి పంపించింది విక్టోరియా. ఈ పాప నుండి వచ్చిన లేఖను చూసి జెసిండా ఓపిగ్గా చదవి నవ్వుకుంది. తర్వాత ఆ లంచాన్ని వద్దంటూ ఆ చిన్నారికి లేఖ కూడా రాసింది ప్రధాని. ఆ లేఖలో ఏముందంటే.. ‘ ఇప్పటికైతే డ్రాగన్లు, ఫిజిక్స్‌పై ఎటువంటి పరిశోధనలు చేయడం లేదు.. నేను డ్రాగన్లు ఎక్కడైనా బయటకు వస్తాయేమో ఓ కనే్నసి పెడతాను. ఇంతకీ డ్రాగన్లు సూట్ వేసుకుంటాయా? ఫిజిక్స్, డ్రాగన్ల విషయంలో మీ సూచనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మేం ఇప్పటివరకూ ఆ విభాగాల్లో ఎలాంటి పరిశోధనలు చేయట్లేదు. నేను నువ్వు ఇచ్చిన లంచం సొమ్మును కూడా తిరిగి ఇచ్చేస్తున్నాను. టెలికెన్సిస్, టెలిపతి, డ్రాగన్ల విషయంలో నీ అనే్వషణలో విజయం చేకూరాలని ఆశిస్తున్నాను’ అని స్వదస్తూరితో సరదాగా లేఖ రాసింది ఆ దేశ ప్రధాని. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటన ఇటీవల ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ప్రధాని చిన్నారికి రాసిన ఉత్తరాన్ని ఆ చిన్నారి సోదరుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అప్పటినుంచి అది వైరల్‌గా మారింది. ఆ చిన్నారి ప్రధాని లేఖ రాసిన విషయాన్ని ఆ దేశ పీఎంవో కూడా ధ్రువీకరించింది. ఏది ఏమైనా దేశ ప్రధానికే లంచం ఇవ్వజూపిన విక్టోరియా ఫొటో బయటకు రాలేదు కానీ ఈ సంఘటన మాత్రం నేడు నెట్టింట్లో వైరలైపోయింది. *