Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా సరిబోంట్లు నేస్తములు నాకిక యెవ్వరు లేరు తల్లి యే
దో సరి లెమ్మటంచు మది దోచిన తీరున బోవజాల సా
వాసము నీవె నాకు సముపాసన నీ పద సేవలే యికన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

దాసుడనైతి కాసులకు దార సుదాదుల మోహమాయలన్
దోసరి లింగ లేక , చలదూర్మికలై చనుచుండె నాయువున్
ఏ సమయంబునైన నిను నేమరి సోమరి నైతి బ్రోవవే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని శ్రీ సరస్వతీ
వీసము మూడు వీసముల విత్తము చిత్తమునన్ గణింతు ని
ద్రా సమయంబునందయిన తప్పను దాచిన డబ్బు లెక్కలన్
నీ సమయంబు నీజపమునే స్మరియింపనిదేమి మాయయో
వాసర వాసిని ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

ఏ సినిమా నటిమణియో యే దరిదాపుల వచ్చె నన్న చోన్
క్రోసెడు దూరమైన మదిరోయక పోయెను పాదచారినై
నీ సరి పుష్కరమ్ములలలో నిర్మల గౌతమి మున్గనైతినే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీ సరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342