Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రాసము మేసి జంతువు సుఖంబుగ తృప్తిని జెందుగాని పే
రాసనుబొంది మానవుదయాచిత పెన్నిధి నంది గూడ సం
తోసము జెందలేడు గద ! దోసము, మోహము, లోభమే కదా
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ

నాసిరకంపు వస్తమ్రలినమ్ము దొలంగగ జేయ బూనినన్
వేసట జెందు టేయగును పీలిక లౌను విశీర్ణ జీర్ణమై
వ్రాసిన వ్రాలు తప్పదట బాలిశుకాడను జాలి జూపవే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయినీ! శ్రీ సరస్వతీ!
చేసితి నిన్ని నాళ్లు సుఖ జీవన యాత్రకు, జేయు యత్నముల్
రోసితి నింక నా బ్రతుకు రూపము కళ్లకు కట్టె వక్రమై
మోసిన పాపభారమిక మోయగలేను తరింపు మమ్మహే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీసరస్వతీ!

ఆసరలేరు యెవ్వరును ఆసట బాసట నీవెనమ్మ నే
వేసట జెందియునంటినిహ వేదనలన్ బడి పూర్వ జన్మ స
ద్వాసన పుణ్య మోయనగ వాసర జేరితినమ్మ నేటికిన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342