Others

మహితమూర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. సమ్మతిఁగార్యముల్ చక్కదిద్దంగను ఁ
బూనంగ వలయును పుణ్యశాలి
శోభనముం గూర్ప సూక్తులు హృదయాన
నిలపుకోవలయును నిత్యసత్య
విజయ ధ్వజము నెత్తి విలసిల్ల గావలె
స్థైర్యమాయుధమవ్వ సమర సింహ
సద్గుణ వ్యాప్తికి సతతంబుఁ బూనిక
వహియింప వలయును మహితమూర్తి

తే.గీ. సాధు సజ్జన సాంగత్య సంపదలనుఁ
గల్గియుండిన నీకీర్తి గణన కెక్కు
ప్రగతి పథమది నీ ముందుఁ బరచుకొనియ
నట్టి పథమందు నడిపింప నడుము గట్టు

తాత్పర్యం: ఓ పుణ్యశాలీ!సద్భుద్ధితో కార్యాలన్నీ చక్కబరచడానికి పూనుకోవాలి. నిత్య సత్యవ్రతా! మేలు చేకూర్చే విధంగా నీ హృదయంలో సూక్తులు నింపుకోవాలి. సరమసింహా! స్థైర్యమే ఆయుధంగా విజయ పతాకాన్ని ఎగురవేస్తూ నువ్వు ప్రకాశించాలి. మహితమూర్తీ! నీతో పాటు ఇతరులలో కూడా సద్గుణాలను నెలకొల్పడానికి సదా నువ్వు పూనుకోవాలి. సాధు సజ్జన సాంగత్యం వల్ల నీకీర్తి గణించబడుతుంది. ప్రగతి పథం నీ ముందుంది. ఆ పథంలో అందర్నీ నడిపించడానికి నువ్వు పూనుకోవాలి.

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం