Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యజ్ఞకుండాలు నక్షత్ర రాశుల్లా ప్రజ్జ్వలించాయి. ఋశ్యశృంగుని ఆధ్వర్యంలో మొదట అశ్వమేథ యాగం, ఆపై పుత్ర కామేష్టియాగం నిర్విఘ్నంగా సాగాయి.
యజ్ఞకుండంలోంచి అగ్నిదేవతలా ప్రాజాపత్య పురుషుడుదయించాడు కోటి సూర్యుల కాంతితో! ఆ వెంటనే తూర్పున సూర్యుడు, పశ్చిమాన చంద్రుడు వారి వారి ప్రభలతో ఏక కాలంలో ఉదయించారు! ‘‘ఆ సూర్యచంద్రులే తన కుమారులైతే ఎంత బాగుండేది?...’’ అనుకున్నాడు దశరథుడు.
ఆ ప్రాజాపత్య పురుషుని చేత స్వర్ణపాత్ర! దాంట్లో నోరూరించే దివ్యమైన పాయసం!... క్షీరాన్నం!... క్షీరదారల్లాంటి వెలుగుల వెల్లువలో నక్షత్రాల్ని ఉడికించి తీసుకువచ్చాడా?!...అన్నట్లుగా ఘుమఘుమలాడుతోందా ఆ పాయసం! ఒక పాలపుంతలా వెలుగులీనుతోందా పాత్ర!...
ఆ దివ్య పురుషుడు, ఆ పాత్రని, దశరథ మహారాజుకందించాడు. తన రాణులకు దానిని ప్రసాదించమన్నాడు. సంతు కలుగుతుందని ఆశీర్వదించాడు.
దశరథుడాపాత్రని ఆనందంగా అందుకున్నాడు. తన కళ్ళకద్దుకున్నాడు.
ఆపై, ఆ దివ్యపురుషుడు అంతర్థానమైపోయాడు.
ఆ పాయసంలోంచి కౌసల్యకు నాలుగుపాళ్ళు, సుమిత్రకు మూడు పాళ్ళు, కైకేయికి ఒక పాలు పంచిపెట్టాడు దశరథుడు.
వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు.
***
సంతాన ప్రాప్తి
వచనం- సూర్యోదయమైంది. అప్పుడే బొడ్డుకోయబడిన బిడ్డలా తూర్పుపొత్తిళ్ళలో సూర్యుడున్నాడు. బొడ్డుకోసిన కొడవలిలా పడమటి చిలక్కొయ్యకి చంద్రరేఖ వ్రేలాడుతోంది అమృత బిందువుల్ని రాలుస్తూ!
ఆ ప్రసాద ఫలితముగా వారు గర్భముల దాల్చిరి
నిండెను నవమాసమ్ములు పండెను కోరికలు
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087