AADIVAVRAM - Others
సీతాకోకచిలుక!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 May 2019
-దాస్యం సేనాధిపతి 9440525544
వర్ణ సమ్మేళనాలతో
ఇంద్రధనుస్సునే వెక్కిరిస్తూ..
గిలిగింతలు పెడుతుంది!
ఏ పువ్వుమీదా
కుదురుగా..
కూర్చోలేని చంచల స్వభావం దాని సొంతం!
మనిషిలోని
భావుకతనీ.. సృజననీ
ఉత్తేజపరుస్తూ..
అద్భుత ఆవిష్కరణలకు
చేస్తుంది అంకురార్పణం!
కళ్లను ఇట్టే
కట్టిపడేసే...
రంగురంగుల రెక్కలతో కూడిన..
దాని మోహన రూపం..
చూసిన కొద్దీ
చూడాలనిపించే
చిత్రకారుడు గీసిన
వివిధ వర్ణాల చిత్రాల
సమాహారం!
చూడ్డానికే
చీదరగా ఉండే
గొంగళి పురుగు నుండి
ఉద్భవించే
సీతాకోకచిలుక..
బంధాల కతీతమైన
స్వేచ్ఛకు ప్రతీక!