Others

న్యాయం కోసం పోరాడితే కటకటాలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలపైన తప్పిదాలు చేస్తోంది. ఈ పరిణామక్రమానికి బోర్డు సభ్యులు, అధ్యాపకుల నిర్లక్ష్యం, నిర్లిప్తత ప్రధాన కారణమంటూ విద్యారంగ విశే్లషకుల భావన. లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించిన తలిదండ్రులు ఇపుడు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థుల ఆందోళనలు, హింసాత్మక సంఘటనలు అందరినీ కలవరపరిచేవిగా ఉన్నాయి. చదువుకోవడం కాదు... చదువును కొనుక్కుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మానసిక ఆందోళన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సైతం వెళ్ళిందంటే ఇంటర్ బోర్డు క్రియాశీలకత్వం నిక్కచ్చిగా బట్టబయలు కావడానికి మరే దృష్టాంతాలు అవసరం లేదు.
జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇంటర్ బోర్డు అనుసరించిన విధానమే సరిగా లేదని విద్యార్థులు, తలిదండ్రులు, సమర్ధవంతులైన పరిశీలకుల నిశ్చిత అభిప్రాయం. బోర్డులో కచ్చితంగా లోపాలు జరిగాయని ప్రస్తుత పరిస్థితులు ఘంటాపథంగా చెబుతున్న నేపథ్యంలో చదువులను డబ్బిచ్చి కొనడానికే కానీ, ఆపై స్థితిగతులకు బోర్డు ఏమాత్రం బాధ్యత వహించదనే మాట విస్మయం కలిగిస్తుంది.
బోర్డు ఉన్నతాధికారులు, సిబ్బంది నిర్లిప్తత, నిర్లక్ష్యం నేడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు శాపంలా మారింది. పరీక్షలు రాసిన విద్యార్థులు కొండంత ఆశతో తమకు మంచి మార్కులు వస్తాయని భావించి మార్కుల చిట్టాను చూసి అప్రతిభులయ్యారు.
పేపర్లు దిద్దిన వారు నిపుణులేనా?
ప్రతి పాఠ్యాంశానికి ఆ రంగంలో నిపుణులైన వారి చేత జవాబు పత్రాలను నిశితంగా పరిశీలించి తగిన మార్కులు ఇవ్వడం ఆనవాయితీ. ఈసారి పరీక్షా పత్రాలను ఆకళింపు చేసుకొని అందుకు తగినన్ని మార్కులు ఇవ్వడంలో సక్రమ పద్ధతిని పాటించకుండా, సరైన జవాబులను నిర్ధారించేందుకు ఎవరికి పడితే వారికి ప్రశ్నాపత్రాలను ఇవ్వడం వలననే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఈ పరిస్థితి దాపురించింది. ధర్నాలు చేయడం, పోలీసుల లాఠీ దెబ్బకు గురికావడం తప్పనిసరైంది.
విద్యార్థులు బాధ్యులా?!
విద్యార్థి లోకం పరిస్థితి ముఖ్యమంత్రి వరకు వెళ్ళడం విద్యాసంస్థల నిర్వాకానికి అద్దం పడుతోంది. విద్యా రంగంలో స్వయం నిర్ణయం గైకొని విద్యారంగాన్ని అభాసుపాలు కాకుండా చేయాల్సిన బోర్డు అధికారులు ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల పరిశీలనకు నూరు రూపాయలు, జవాబు పత్రాల సమగ్ర పరిశీలనకు ఆరు వందల రూపాయల నిర్ణయించడం ఏమాత్రం సబబని విద్యార్థి నాయకులు, తలిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మహత్యలకు ఎవరు కారకులు?
మానసికంగా కుంగిపోయి, ఇక తమకు భవిష్యత్తే లేదని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు ధృడచిత్తంతో విద్యార్థులు తమకు న్యాయం చేకూర్చాలనే నినాదాలతో బోర్డుపైన, ప్రభుత్వంపైన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఉద్యమిస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టులు చేసి వ్యానులెక్కిస్తున్నారు. నిజాయితీగా, న్యాయంగా తాము రాసిన జవాబులకు మార్కులు వేసి న్యాయం చేయండి. గారడీ వద్దు. మంచిగా మా భవిష్యత్తును తీర్చిదిద్దండి.. అని విద్యార్థులు వేడుకొంటున్నారు. ఇలాంటి తప్పిదాలు ఇకముందు జరగకుండా ఉండేలా ఇంటర్ బోర్టు తగిన చర్యలు తీసుకోవడానికి ఇదే మంచి తరుణం.

-దాసరి కృష్ణారెడ్డి