Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూసెడు రుూ ప్రపంచ గతి చూసిన చందముగాదు లోపలున్
మూసిన వింతలేవొ యవి ముందర నిల్చుని మోసగించెడున్
చేసెడు రీతి యొక్కటియు జెప్పెడు నీతులు తద్విరుద్దముల్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

చేసిన పాపకర్మములు చెప్పిన పాపము బోవునంచు నే
దో సులభంబు మార్గమును దోచిన రీతిని జెప్పువారు గా
నీ సరిగాదు, దానికిని నివ్చయ మార్గము నీదు సేవయే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!
చేసితి తీర్థయాత్రలను జేసితి పూజలు తద్వ్రతంబులున్
చేసిన దెల్ల పుణ్యమని జేయుచు నుంటి ననేక కర్మముల్
వేసవి యెండ మావులటు విభ్రమమే మిగిలించెనమ్మ హే
వాసర వాసనీ ప్రధిత వాగ్వర దాయిని శ్రీ సరస్వతీ!

సీసముద్రావవచ్చునట చేసిన సాధన, నగ్ని గుండముల్
పోసి పూలబాటవలె పూనిక దాటగ వచ్చునంట గా
నీ! సరిజూడ నాత్మ పరినిగ్రహమందుట దుష్కరంబగున్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని !శ్రీ సరస్వతీ!

ఉమాపతి శర్మ 9246171342