Others

పట్టులాంటి జుట్టుకై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌందర్యం పెరగాలంటే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు..
* తలను సాధ్యమైనంత పరిశుభ్రంగా, నూనె లేకుండా ఉంచుకోవాలి. అందుకోసం తరచూ తలస్నానం చేస్తుండాలి. దానివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని రోజూ తలస్నానం చేస్తే తల్లోని సహజ నూనెలు పోతాయి. దాంతో జుట్టు ఎదుగుదల తగ్గుతుంది. వారంలో రెండు, మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది.
* సాధ్యమైనంతవరకూ హెయిర్ స్టయిలింగ్ చికిత్సలూ, ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వాటిలో గాఢత ఎక్కువగా ఉండే రసాయనాలు తాత్కాలికంగా మెరిపించినా భవిష్యత్తులో జుట్టు ఎదుగుదలను నియంత్రిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని వాడకపోవడమే మంచిది.
* జుట్టు మరీ పొడిగా కనిపిస్తుంటే కలబంద గుజ్జు లేదా పెరుగును తలకు పట్టించి కాసేపయ్యాక కడిగేయాలి. జుట్టుకు కండీషనర్ వాడుతున్నా అప్పుడప్పుడూ కలబంద గుజ్జు రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేయాలి. దానివల్ల జుట్టు మెరుస్తుంది.
* రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో టేబుల్‌స్పూన్ నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా అప్పుడప్పుడూ చేస్తుంటే జుట్టు మెత్తగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
* జుట్టు తత్త్వాన్ని బట్టి అనుసరించి కండీషనర్, షాంపూను ఎంచుకోవాలి. అలాగే తడి తలను ఎట్టి పరిస్థితుల్లోనూ దువ్వకూడదు.
* తలస్నానం కోసం గోరువెచ్చని లేదా చల్లని నీళ్లు మాత్రమే వాడాలి. అంతకు అరగంట ముందు ఆముదాన్ని వేడిచేసి దాన్ని తలకు రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి.
* జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా మారాలంటే.. ఒక కోడిగుడ్డును తీసుకుని అందులో ఒక చెంచా నూనె, కొద్దిగా నిమ్మరసం పిండి తలకు పెట్టుకుని తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా ఉంటుంది.
*