Others

అక్షర తపస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వం ఒక యజ్ఞం
కవిత్వం ఒక తపస్సు

కవిత్వమంటే
నాలుగు అక్షరాల కూర్పు కాదు
పలు ప్రపంచాల సమాజాన్ని ఆవిష్కరించడం

నాలుగు పదాల మేళవింపు కాదు
నవతరాన్ని మేల్కొలిపే అక్షర సైన్యం

నాలుగు వాక్యాల పద విన్యాసం కాదు
కొత్త లోకాన్ని ఆవిష్కరించే అధునాతన దిక్సూచి

అవును
కవిత్వమంటే సమాజంలోని అసమానతలను
ఎత్తిచూపే అపరకాళిక
కవిత్వమంటే మనిషిలోని మానవత్వాన్ని
తట్టి లేపే కారుణ్య దీపిక
కవిత్వం -
వాస్తవాన్ని ముద్దాడే అక్షర కరచాలనం
నిజాలను నిర్భయంగా చాటే వజ్రాయుధం

అవును... కవిత్వం ఇప్పుడు
చీకటి కోణాల్ని వెలికితీసే వెనె్నల కిరణం
అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే పాంచజన్యం

కవిత్వమంటే
మనిషి గురించి రాయడం కాదు
మనిషి లోలోపలి సంవేదనలను ఆవిష్కరించడం

కవిత్వమంటే
కాగితంపై రాసే అక్షరాలు కాదు
పొయ్యలో భగభగ మండే నిప్పుకణికలు
చేనులో పండే మొక్కజొన్న కంకులు
మగ్గంపై మెరిసే వెనె్నల జలతారు
నింగిపై ప్రకాశించే అభినవతారలు
పేదోళ్ల మోముపై విరిసే అందాలు

కవిత్వం-
ఎవరూ చూడని అధోలోకం
ఎవరూ ముట్టని పాదరసం

- డా. భీంపల్లి శ్రీకాంత్, 9032844017