Others

కలం - కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచన కలంతో
మొదలయ్యంది ఈ కలకలం
మింటి కెగిసిన మేడలు
మంటి కతికిన గూడులు
వీటి మధ్య, మధ్యతరగతి గోడు
నిద్రపోయన నగరం మత్తులో
నాగరికతల గమ్మత్తులు
ఒకవైపు బలిపెట్టిన కర్షక బ్రతుకుల తాకట్టు
మరోవైపు బలిపీఠంపై కట్టిన కార్మికుని మెట్టు
ఇదే కదా కలం గళ్లకట్టు
మాతృగర్భం చీల్చుకుని వచ్చిన
సమస్యల వలయాలతో
మృత్యుగర్భం దాల్చుకున్న
అవినీతి విలయాలతో
బ్రతుకు పండిన వృద్ధాప్యం
అవిటికాళ్ళ దారిద్య్రం
ఇదే కదా కలం దౌర్భాగ్యం
కన్నీటి చెలిమను దోసిట్లో ఉంచిన
నైరాశ్యాన్ని
ఆవిరవుతున్న నిట్టూర్పుల
భాష్యాన్ని కార్చుతున్న సిరా కన్నీటితో
నీ బలం తెలుసుకున్నాను
కలం!
నీవు కాలానికి కట్టిన వంతెనవి
ప్రజా గళాన్ని నింపుకున్న చింతనవి
సామాజిక విలువల వలువలతో
గురిపెట్టిన సాహిత్యపు
చైతన్య విల్లువి.

- సముద్రాల శ్రీదేవి, 9949837743