Others

తెలుగు కవితలో చమత్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం॥ గజగమన కాదు ఇయ్యది
గజసదృశ శరీర సీటు కంతయు తానై
అ జగరమై కూర్చున్నది
గజిబిజియై పోయె మనసు కన్నులు కూడన్‌॥
ఆయన గుత్తి దగ్గరున్న ప్యాపిల గ్రామాన్ని, కాళహస్తిని దర్శించినప్పుడు ఆయనకు తారసపడిన వారిని వర్ణించాడు.
కం॥ మొగమున కెగిరెడు చన్నుల
సొగసుల చిన్నారిదాన చూడగనీవే
బిగి జక్కవ చనుగవలో
వగ గల బంగారు గలదో వయసే గలదో.
ఈ పద్యం ద్వారా మనకో విషయం తెలియవస్తున్నది. అందమునకు చందమునకు వయస్సు అవసరమని. ఒకచోట ఒకనాడు శ్రీనాథున్ని తికమక పెట్టడానికి అతన్ని కొంచెము చేసి కించపరుచుటకై ఒక సమస్య నిచ్చారట. దానిని అద్భుతంగా పూర్తిచేసి తరువాత కవులకు అవధానులకు ఒరవడిదిద్దారు.
సమస్య- అందరు అందరే మఱియు అందరు అందరె అందరందరే -
పూరణం:-
కొందరు బైరవాశ్యములు కొందరు పార్థునితేరి టెక్కమల్
కొందరు ప్రాక్కిటీశ్వరులు కొందరు కాలుని యెక్కిరింతలున్
కొందరు కృష్ణజన్మమున కూసిన వారలు నీ సదస్సులో
నందరు నందరే మఱియు నందరు అందరు అందరందరే!
శ్రీనాథ కవివరుండు పేదవాడై చరమదశలో చెప్పిన చాటువుల్లో పేరెన్నికగన్న చాటువు.
సీ॥ కవిరాజు కంఠమ్ము కౌగిలించెను గదా
పురవీధి నెదురెండ పొగడదండ
ఆంధ్ర నైషధకర్తయంఘ్రియుగ్మమ్మున
దగిలియుండెను గదా నిగళయుగము
వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత
వియ్యమందెనుగదా వెదురుగొడియ
సార్వభౌముని భుజాస్తంభమెక్కెనుగదా
నగరి వాకిటనుండు నల్లగుండు
కృష్ణవేణమ్మ గొనిపోయే నింత ఫలము
బిలబిలాక్షులు తినిపోయెతిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేఱు మోసపోతి
నెట్టు చెల్లింతుటంకంబు లేడునూర్లు.
అని వాపోయాడు. ఎంతటి వానికైనను విధి బలీయము అనుభవింపక తప్పదు. శివున్ని సైతము ఆజ్ఞాపించే శ్రీనాథుడిట్లు ప్రాపంచిక బాధననుభవించాడు. బంగారు కంచములో పంచ భక్ష్యపరమాన్నము లారగించిన యితడు చివరికాలములో పస్తులున్నాడు. ఇతని చరమదశ, కుశాగ్ర సునిశిత కుశ. ప్రెగడరాజు నరసరాజు చతుశ్శాస్త్ర పండితుడు. ఒకరోజు ఆయన రాగల సభకేతెంచి తాను వేగంగా వ్రాయగలననీ ఎంత వేగంగా కవిత్వము చెప్పిన వ్రాయగలనని, నావలె వ్రాయుగలవాడు లేడని సవాలుగొట్టాడు. ఈ విషయములో రామకృష్ణుడు అతని వారించాడు. రామకృష్ణుడాశువుగా పద్యాలు చెప్పుట మొదలుపెట్టాడు. ఒకటి రెండు చెప్పిన తరువాత చిత్రమైన ఉచ్ఛారణతో ఈ క్రింది పద్యమన్నాడు.
కం॥ తృవ్వట బాబా తలపై
బువ్వట జాబిల్లి వల్వ బూదటచేదే
బువ్వట చూడగను హుళి
క్కవ్వట తలపంగ నట్టి హరునకు జేజే
అంతే అయ్యగారి ఘంటమాగిపోయింది- ఇదే విధంగా మరొక కవిని ఓడించాడట. ఆ పద్యమిది -
‘‘వక్కలు చేరెడు నేగొని
చొక్కాలో బోసికొంటి చొచ్చొచ్చొచ్చో
యెక్కడి దొంగలు వచ్చిరొ
అక్కరకును లేకపోయే హరి శ్రీకృష్ణా
తెనాలి రామకృష్ణుని చాటువులందు చమత్కారము తిట్టు, ధిషణంహకారాలు, శాపనార్థాలే కాకుండా, భాషాపాటవము కూడా ఉంటుంది. ఆయన రచించిన ‘‘పాండురంగ మహత్మ్యము’’ ప్రబంధాలలో ప్రముఖమైనది.

- యం. వి. నర్సింహారెడ్డి