Others

జాతి విస్మరించలేని రాజీవ్ వ్యక్తిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు రాజీవ్ వర్థంతి
*
నేను యువ స్వాప్నికుణ్ణి. ప్రపంచ మావవాళికి సేవలందించటంలో నా దేశం ప్రథమ స్థానంలో దేశాలన్నింటిలో అగ్రగామిగా వుండాలని, నా దేశం పటిష్టంగా, స్వతంత్రంగా, స్వయంపోషకంగా వుండాలని కల కంటున్నాను. నా దేశం ప్రాచీనం అయినా నవవనం’’ అంటార, 40వ ఏట భారత ప్రజాస్వామ్య రథసారథిగా ప్రధాని బాధ్యతలు అయిదేళ్ళు నిర్వర్తించిన రాజీవ్‌గాంధీ. 1985లో మిస్టర్ క్లీన్‌గా ఇందిరమ్మ తనయునిగా రాజకీయ పంకంలో ఆకర్షణీయమైన సుందరవదనారవిందంతో భారత ప్రజను సమ్మోహితం చేసిన రాజీవ్, ‘ముళ్లకిరీటం’గా అయిష్టంగా తల్లి హత్యానంతర పరిస్థితులలో ప్రధాని అయ్యారు. 1980లో సోదరుడు సంజయ్ ఆకస్మిక మరణంతో, 11 నెలల తరువాత ఇండియన్ ఎయిర్‌లైన్స్ పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేసి 37వ ఏట లోక్‌సభలో ప్రవేశించారు. 1981 మే 11న కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడైన రాజీవ్ దేశ ప్రధానిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్నికలలో ప్రచార సారథ్య నేతగా 1991 మే 21న శ్రీలంక తమిళ ఉగ్రవాదుల ‘్ధను’ మానవ బాంబు హంతకి పేల్చిన విస్ఫోటనంలో బలిఅయ్యారు. 1985-89 లలో భారతదేశాన్ని సూపర్ ఇండియాగా దేశ ప్రధానిగా నవోత్తేజంతో 21వ శతాబ్దంవైపు నడిపించారు. కంప్యూటర్‌ల వినియోగం, టెలికమ్యూనికేషన్స్ దేశాన్ని నాడే శాస్ర్తియ ప్రగతిమార్గం పట్టించాయి. భారత సైనిక దళాల నవీకరణ, రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత యుద్ధోన్మాద శత్రు దేశాలను చిత్తుచేయగల సామర్థ్యం దేశం సాధించింది. రాజీవ్ డాక్ట్రిన్ ప్రకారం డిఫెన్స్‌కు బడ్జెట్ పెంచి దేశ రక్షణ, సమగ్రత, భద్రతతో మిలటరీ పవర్‌లో మిస్సైల్స్, ఫ్రైగేట్స్, సబ్‌మెరైన్స్ ప్రవేశించి పాకిస్థాన్, చైనా ఆటకట్టించటానికి ఇండియా సంసిద్ధమైంది. టైమ్స్ పత్రిక రాజీవ్ ప్రధానమంత్రిగా భారత్ రక్షణ రంగంలో ప్రపంచంలోనే సూపర్ ఇండియాగా ఆవిర్భవించినట్టు 1989లో ప్రశంసించింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యుకె, చైనా వంటి అగ్ర దేశాల సరసన ప్రపంచ రాజనీతిజ్ఞతలో భారత్ కీర్తిపతాకను ఎగురవేసింది.
రాజీవ్‌పై ‘బోఫోర్స్’ కళంకం
భారతదేశపు 7వ ప్రధాని రాజీవ్‌గాంధీపై, ప్రస్తుత 15వ ప్రధాని నరేంద్రమోడీ, 17వ లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించే రాజకీయ వ్యూహంలో భాగంగా, రాజీవ్‌కు భ్రష్టత్వం ఆపాదించే అవినీతి ఆరోపణలతో కించపరచటం కారణంగా రాజకీయ ప్రయోజనం మాట అటుంచి, ప్రధాని మోడీ వ్యక్తిత్వం అప్రతిష్ఠపాలైంది. రక్షణ రంగ నవీకరణ లక్ష్యంతో, రాజీవ్ ప్రభుత్వం 1986 మార్చ్‌లో బోఫోర్స్ శతఘు్నల కొనుగోళ్ళకు సంబంధించి స్వీడిష్ కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకొంది. స్వీడిష్ చట్టాల ప్రకారం ముడుపులు లేదా కమీషన్‌లు చెల్లించటం నేరం కాకపోయినా ఆ తతంగం అవినీతి కుంభకోణంగా తీవ్ర దుమారం లేపింది. 1988-89లలో పరిశోధనా జర్నలిజంలో భాగంగా స్వీడిష్ పోలీస్ చీఫ్ స్టెన్ లిండ్‌స్ట్రొమ్ వెలువరించిన అంశాలు ది హిందూ వెలుగులోకి తెచ్చింది. 1987 ఏప్రిల్ 16న స్వీడిష్ స్టేట్ రేడియో ప్రసారం సంచలనం సృష్టించింది. 1989 సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ ప్రభుత్వ ఓటమికి బోఫోర్స్ ప్రచారం కారణమైంది. నాటి రక్షణమంత్రి వి.పి.సింగ్ దర్యాప్తునకు ఆదేశించి పదవికి రాజీనామా చేసి తరువాత తాను ప్రధాని అయ్యాక కేసు కొనసాగించారు. దశాబ్దాల అంతర్జాతీయ వివాదంలో ప్రధాన నిందితుడు ఇటలీ వ్యాపారవేత్త ఖత్రోచిపై 2009 అక్టోబర్‌లో రెడ్ కార్నర్ నోటీసు ఉపసంహరించుకోవటంతో కేసు విచారణ ఆవిరయిపోయింది. 2004 ఫిబ్రవరి 4న ఢిల్లీ హైకోర్టు జస్టిస్ జె.డి.కపూర్ రాజీవ్‌గాంధీ ఈ కేసులో నిర్దోషిగా తీర్పు చెప్పారు. అంతకుముందు 1990 జనవరి 22న బొఫోర్స్ సంస్థ అధ్యక్షుడు మార్టిన్ అర్టొబొ, మధ్యవర్తి విన్‌చద్దా, హిందూజా సోదరులపై సిబిఐ ఎఫ్.ఐ.ఆర్. రిజిష్టరు చేసింది. 1999 అక్టోబర్ 22న, 2000లో చార్జ్‌షీట్లు వేసారు. 2013 జూలైలో ఖత్రోచి మరణించాడు. అప్పటి డిఫెన్స్ సెక్రటరీ భట్నాగర్, చద్దా, అర్టొబొ కూడా మరణించారు. సిబిఐ కేసుపై 2005 మే 31న జస్టిస్ ఆర్.ఎన్.సోధీ ఢిల్లీ హైకోర్టులో హిందూజా సోదరులపై ఆరోపణలు కొట్టివేస్తూ ఈ కేసులో రు.64 కోట్ల అవినీతి ఆరోపణలకు యింతవరకు రు.250 కోట్లు ప్రజాధనం వినియోగించారని వ్యాఖ్యానించారు. 1986 మార్చి 24న నాటి ఒప్పందం రాజకీయపరంగా మళ్ళీమళ్ళీ తలఎత్తుతూనే వుంది. 155 ఎమ్.ఎప్. ఎఫ్.హెచ్. 77-బి 400 తుపాకుల కొనుగోలుకు స్వీడిష్ కంపెనీకి 1986-87లో రు.1473.72 కోట్లు వ్యయమైన డీల్ అది. 1989-90లో ప్రధాని వి.పి.సింగ్ ప్రభుత్వం ఈ అవినీతి ముడుపుల చెల్లింపు వ్యవహారంపై ఒక అంతర్జాతీయ ప్రైవేట్ దర్యాప్తు సంఘాన్ని నియమించింది. ఆ సంస్థ అధినేత మైఖేల్ హెర్షమన్ యిటీవల ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో బోఫోర్స్ కేసులో అవినీతిపరుల చిట్టా తన దగ్గర వుందని నిర్థారించటంతో సిబిఐ 2018 ఫిబ్రవరిలో దర్యాప్తు కొనసాగించటానికి కోర్టును అభ్యర్థించింది. ఈ సంవత్సరం మే 16న ఢిల్లీలోని చీఫ్ మెట్రొపొలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును స్వతంత్ర అధికార సంస్థగా సిబిఐ తాను దర్యాప్తు చేపట్టటానికి అనుమతించవలసినదిగా అభ్యర్థించింది. యిటీవల ప్రధాని నరేంద్రమోడీ రాజీవ్‌గాంధీపై వ్యాఖ్యలు సి.బి.ఐ.కు మరింత బలం యిస్తున్నాయి. 2009 సార్వత్రిక ఎన్నికలలో నిర్వీర్యం అయిన బోఫోర్స్ అస్త్రాన్ని 2019 ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ మళ్ళీ ప్రయోగించింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణప్రదమైన ఈ అత్యున్నత లోక్‌సభలో వాస్తవం చెప్తున్నాను. నాకు లేదా మా కుటుంబ సభ్యులకు ఎవరికీ సంబంధం లేదు’’ 1987 మేలో రాజీవ్ స్పష్టంచేసారు.
వారసత్వంగా అధికారాన్ని, పదవులను అధిష్ఠించటం భారత రాజకీయాలలోని అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. ఇందిరాగాంధీ అధికార ఆధిపత్యాన్ని నిరంకుశ పోకడలను నాడు ప్రతిఘటించి ప్రతిపక్ష పార్టీల ఐక్యతగా ఏర్పడిన జనతాపార్టీ కుప్పకూలి భారతీయ జనతాపార్టీ ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా దేశాధికారం చేపట్టే అవకాశం కల్పించింది. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ల వరుసను కొంతకాలం సోనియా తప్పించటం చారిత్రక వాస్తవం. మళ్ళీ ప్రస్తుత 17వ లోక్‌సభ రానున్న సందర్భంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ తెరపైకి వచ్చారు. ఎన్.డి.ఎ., యు.పి.ఎ. సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీల ప్రాభవంతో కాంగ్రెస్, బిజెపిలు నిలదొక్కుకోక తప్పదు. కేవలం కుటుంబ, వారసత్వ పాలనను దుయ్యబట్టడానికి ప్రచార అస్త్రంగా రాజీవ్‌గాంధీకి కళంకం ఆపాదించటం, ప్రస్తుత రాజకీయ వర్తమానాంశం.

- జయసూర్య