Others

సాధ్విని క్షమించలేం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యప్రదేశ్ భోపాల్ భారతీయ జనతాపార్టీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, జాతిపిత మహాత్మాగాంధీ అమానుష హంతకుడైన నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా ప్రశంసించటంపట్ల ఆమెను తానెన్నటికీ క్షమించనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. 17వ లోక్‌సభలో అడుగుపెడ్తున్న భారత రాజకీయాలలో ఎన్నడూ తన పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిపై స్వయంగా ప్రధాని అటువంటి అభిప్రాయం వ్యక్తీకరించటం కనీవినీ ఎరుగని కాంగ్రెస్, బి.జె.పి. పార్టీవర్గాలకు ఊహించలేని సంచలనమైంది. బి.జె.పి. ప్రభుత్వ కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెడ్గే, కర్ణాటక ఎంపీ నళిన్‌కుమార్ కతీల్‌పై కూడా క్రమశిక్షణాచర్యలు తప్పవని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పందించారు. శతాబ్దాల తరబడి ముస్లిమ్, బ్రిటిష్ పాలనాధికారంలో మగ్గిన అఖండ భారతావని ఇండియా, పాకిస్థాన్‌లుగా విభజింపబడిన దుష్పరిణామం ఒక చారిత్రక విషాదం, తొలితరంలోని స్వాతంత్య్ర సమరయోధులు, తిలక్, అరబింద్ ఘోష్, మాలవ్యా, మున్షీ, గాంధీజీ వంటి మహనీయులు భారతీయ ఆత్మను ఆవిష్కరింపచేసే సమున్నత సంప్రదాయ హిందుత్వ విలువలకు జాతి ఐక్యత దృష్ట్యా ప్రాధాన్యత యిచ్చారు. క్రమేపీ స్వాతంత్య్రం సాధించేముందు దశాబ్దంలో హిందూ రాష్ట్రం అంటే హిందుత్వ జాతికి దేశ రాజ్యాధికారం దక్కాలనే బలీయమైన రాజకీయశక్తి తల ఎత్తింది. 1922లో స్వాతంత్య్ర సమరయోధుడు వీరసావర్కార్ హిందుత్వ శీర్షికన సంచలనాత్మకంగా, అజేయమైన హిందూ సంఘటన నిర్మాణ లక్ష్యాన్ని ప్రబోధించారు. జాతీయ సంస్థ ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’కు క్రమేపీ హిందూ రాష్ట్ర సిద్ధాంతవాదులు దూరమయ్యారు. డా. హెడ్గేవార్ 1925లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించారు. గాంధీజీ నాయకత్వంలోని హిందూ-ముస్లిమ్ ఐక్యతావిధానం సావర్కార్ వంటి కొందరు పెద్దలకు కంటగింపు అయింది. హిందూ రాజ్య తీవ్రవాదం తలెత్తింది. రెండుసార్లు హిందూ మహాసభ అధ్యక్షుడైన వీరసావర్కార్, పూనాలో 1942నాటికి హిందూ రాష్ట్ర దళ మిలిటెంట్ రహస్య సంస్థ స్థాపించారు.
గాంధీజీకి ముస్లిం పక్షపాతిగా ముద్ర
1940-47 మధ్య మహమ్మదాలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం వలన అఖండ భారత విభజన అనివార్యమైంది. హిందూ పీష్వాల రాజకీయ వారసత్వంగా మహారాష్ట్ర పూనాలోని చిత్పవన బ్రాహ్మణ కుటుంబంలోని ప్రగాఢ హిందుత్వవాది నాధూరామ్ గాడ్సే వంటి యువకులు ఎందరో సావర్కార్ అడుగుజాడల్లో గాంధీజీతో విభేధించారు. 1937నాటికి గాడ్సే వీరసావర్కార్ అనుంగు శిష్యుడయ్యాడు. 1940 నాటికి బానిస భారతావనిలో అంతకుముందు శతాబ్దాలలో మొగల్, బ్రిటిష్ పాలనను ప్రతిఘటించిన హిందూ రాజ్యాధీశులు, వారి సాహసిక త్యాగచరిత్ర హిందుత్వవాద యువకులకు, ఆదర్శనీయంగా ఆరాధ్యనీయమైంది. 1944 జనవరిలో ‘అగ్రణి’ పత్రిక ప్రభుత్వ నిషేధంతో నాధూరామ్ గాడ్సే, సహచరుడు నారాయణ్ అప్టేతో కలిసి ఎడిటర్‌గా ‘హిందూ రాష్ట్ర’ పత్రిక ఆరంభించారు. 28వ ఏట గాడ్సే బ్రహ్మచర్యం స్వీకరించారు. హిందూ రాష్ట్రం జీవితాశయం అయింది.
స్వాతంత్య్రానంతరం ఇండియా, పాకిస్థాన్‌లలో తలెత్తిన అమానుష హింసాకాండలు, మత విద్వేషం గాంధీజీని నిస్సహాయుణ్ణి చేసింది. ఆస్తికంగా దైవవిశ్వాసి అయిన గాంధీజీకి నాటి ఇండియన్ యూనియన్‌ను మతానికి అతీతంగా లౌకిక వ్యవస్థ నెలకొల్పే సత్సంకల్పానికి బీజాలు నాటుతున్న నాటి ప్రధాని నెహ్రూ, పటేల్ నాయకత్వంతో వైరుధ్యం లేదు. కానీ విభజన నేపథ్యం సృష్టించిన విద్వేషంలో మత సహనానికి, హిందూ - ముస్లిమ్ శాంతియుత సహజీవనానికి బాపూ ఆ రోజుల్లో మరింత అంకితమయ్యారు. ఈశ్వర్ అల్లా తేరేనామ్‌గా గాంధీజీ సిద్ధాంత ఆచరణ, మత సహనం, ముస్లిమ్‌ల పట్ల సమాదరణ ముస్లిమ్‌ల పక్షపాతిగా ముద్రవేసింది. హిందుత్వ సంస్థల యువతరానికి గాంధీజీ ప్రబల శత్రువయ్యారు. నవభారత నిర్మాతలకు గాంధీజీని ఎలా సముదాయించాలో, ఎలా నచ్చచెప్పాలో అర్థంకాలేదు. పాకిస్థాన్‌తో నాటి పాలనా బాధ్యతలలో శత్రు, కొంత మిత్రదేశంగా భావించక తప్పలేదు. అఖండ భారత్ సాధించే ఆశయం నాటి స్థితిగతులలో అఖండ హిందుత్వ వాదానికి నెహ్రూ-పటేల్ సారథ్యంలోని ప్రభుత్వానికి కంటకం అయింది. పైగా 1948 జనవరి 13న, పాకిస్థాన్‌కు రు.550 మిలియన్‌లు యిచ్చే ఒప్పందం వెంటనే అమలుచేయాలనే, మిగిలిన అంశాలతో సహా గాంధీజీ చేపట్టిన ఆఖరి నిరాహారదీక్ష ప్రభుత్వాన్ని యిరకాటంలో పెట్టింది. పాకిస్థాన్‌లో రాజకీయ మత విద్వేషంతో నిస్సహాయులైన హిందువులను ఊచకోత కోస్తున్నా, సంయమనం, సహనంతో వ్యవహరించమని గాంధీజీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని, యిక భౌతికంగా ఆయనను తొలగించటం తప్ప గత్యంతరంలేదని హిందుత్వ రాష్టవ్రాద యువకులు ఆయనపై హత్యాప్రయత్నాలు ముమ్మరం చేసారు.
గాడ్సేకు ఆత్మశాంతి సాధ్యమా?
స్వాతంత్య్రానంతరం గాంధీజీ అయిదు నెలల పదిహేను రోజులు జీవించారు. ఆయన వయస్సు 79 ఏళ్ళు. ఆమరణ నిరాహార దీక్షలతో కృంగి కృశించారు. జనవరి 20న మదన్‌లాల్ చేసిన హత్యాయత్నం విఫలమైంది. జనవరి 30న నాధూరామ్ గాడ్సే బెర్రెట్టా 9 ఎమ్.ఎమ్, సెమి ఆటోమేటిక్ ఆయుధంతో మూడుగుండ్లుతో నిర్దాక్షిణ్యంగా మహాత్ముణ్ణి కాల్చిచంపాడు. తదనంతర పరిణామాలలో 1949 నవంబరు 15న, స్వతంత్ర భారతంలో తొలి మరణదండనగా అంబాలా జైలులో నాధూరామ్‌గాడ్సే, నారాయణ అప్టేలను ఉరితీసారు. తమ్ముడు గోపాల్ గాడ్సే 1964లో విడుదల అయ్యాడు. అది కేవలం మతోన్మాద ఉగ్రవాదం తొలి అడుగు.
ఐక్యహిందూ సామ్రాజ్య అఖండ ఉపఖండంలో ప్రవహించే ఇండస్ నదీ జలాలలో మాత్రమే ఎన్ని తరాలయినా తన చితాభస్మాన్ని కలిపేవరకు తన ఆత్మశాంతించదని గాడ్సే తన అంతిమ విల్లులో పేర్కొన్నారు. అది సాధ్యమా? అఖిల భారత హిందూ మహాసభ గాడ్సే విగ్రహ ఆలయ ప్రతిష్ఠలతో ఆరాధించినా, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ నోరు పారేసుకొన్న వ్యాఖ్యకు నాలుక కరుచుకొన్నా జాతిపిత మహాత్ముని పట్ల గౌరవంతో ప్రధాని ఆమెను క్షమించకపోవటం మోడీ రాజకీయ విజ్ఞతకు పరాకాష్ఠగా అభినందనీయం.

- జయసూర్య