Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవునా? రాముడెచ్చట?’’ నంచు లేచె సంద్రము
నింగినంటి తారల చెవినూదె నంత విషయము

దారి వెదకుకొంచు భువిని తారలెన్నొ రాలెను.
కాంతులు వెదజల్లు అతని కన్నులలో దాగెను.

భూమి ఊయలొచు నూగి శ్రీరాముని ఊచెను
‘‘కూతునిత్తు నోయినీకు’’ నంచు చెవిని ఊదెను

అంబరమ్ము సంబరపడి అతనిని ముద్దిడెను
ఆ ముద్దే ఆ బుగ్గను పుట్టుపచ్చయాయెను

ఒక మేఘం భూమికి దిగి నతని పలకరించెను
వానినెత్తి, కౌగలించి తన రంగును పులిమెను

రెక్కవిప్పి విహంగమ్ము ఆకసమున కెగసెను
‘‘ఎచట నుంటి వోయి నీవు రామా!’’యని అరచెను

చెట్టునుండి చెట్టుపైకి వానరమ్ము గెంతెను
ఒక పర్వత శిఖరమెక్కి చూచెనుడుత నలుదెసలను

ఒక సర్పం పుట్టవీడి పొట్టపైని ప్రాకెను
‘‘ఎక్కడ? రామన్న ఏడి? ఏడం’’చును వెదకెను

ఒక అంబుజముదధి వీడి కౌగలించె కంఠమ్మును
ఒక అంబుజ సమూహమ్ము పడెను పాదములను

అతని పాదస్పర్శకొరకు నెదురు చూచె వనము
అతని దాహమును తీర్చగ దాహము గొనె నదము

తరులు చూచె, గిరులు చూచె, దారులెదురు చూచె
పువుల కౌగిలుల నెత్తుకు లతలెల్లను చూచె
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087